29.3 C
Hyderabad
Friday, October 30, 2026

Live Video

spot_img

లక్షా 27వేల గ్రామాల్లో ఆర్‌ఎస్‌ఎస్‌

రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ అఖిల భారత ప్రతినిధి సభ బెంగళూరులో జరుగుతోంది. మూడు రోజుల పాటు జరిగే ఈ సమావేశాల కోసం దేశ, విదేశాల నుంచి ఆహూతులైన ప్రతినిధులు హాజరయ్యారు. ఆర్‌ఎస్‌ఎస్‌ అత్యున్నత సభగా చెప్పుకునే ఏబీపీఎస్‌ కోసం ఆర్‌ఎస్‌ఎస్‌ ముఖ్య నేతలతో పాటు.. ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రేరేపిత సంస్థలైన 32 సంఘాలకు చెందిన వివిధ క్షేత్రాల ముఖ్య ప్రతినిధులు ఈ సమావేశాలకు తరలి వచ్చారు.

ఈ సందర్భంగా భారత దేశంలో యాక్టివ్‌ గా పనిచేస్తున్న ఆర్‌ఎస్‌ఎస్‌ శాఖల వివరాలను సమావేశానికి హాజరైన ప్రతినిధులు సమర్పించారు. ఈ వివరాల ప్రకారం.. భారత దేశంలో 2025 సంవత్సరంలో పనిచేస్తున్న శాఖల సంఖ్య పెరిగిందని తెలుస్తోంది. మొత్తం 51వేల 570 ప్రాంతాల్లో శాఖలు పనిచేస్తున్నాయి. రోజువారీగా నిర్వహించే శాఖల సంఖ్య 83వేల 129 కాగా, వారానికోసారి నిర్వహించే మిలన్‌ల సంఖ్య 32వేల 147గా నిర్ధారించారు. అలాగే, నెల వారీగా నిర్వహించే మండలిల సంఖ్య 12వేల 91గా ఉంది. వీటిని బట్టి చూసుకుంటే.. మొత్తం శాఖ, మిలన్‌, మండలిలన్నీ కలిపి.. ఒక లక్షా ఇరవై ఏడువేల మూడు వందల అరవై ఏడు గ్రామాలకు సంఘం విస్తరించిందని ఈ సమావేశాలకు హాజరైన ప్రతినిధులు నివేదికలను సమర్పించారు. భారత దేశంలో 2011 జనాభా లెక్కల ప్రకారం చూస్తే.. మొత్తం 6,49,481 గ్రామాలు ఉన్నాయి. వాటిలో ఒక లక్షా 27 వేల గ్రామాల్లో ఆర్‌ఎస్‌ఎస్‌ కార్య కలాపాలు కొనసాగుతున్నాయి.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com