ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ వ్యాఖ్యాలపై మండిపడ్డ రాహుల్‌గాంధీ
దేశం విచ్ఛిన్నం చేసే శక్తులను ఆపగలిగేది ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని రాహుల్‌గాంధీ స్పష్టం చేశారు. బుధవారం ఢిల్లీలో ఏఐసీసీ నూతన కార్యలయం ప్రారంభం సందర్భంగా రాహుల్ గాంధీ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సమావేశంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ దేశంలో ఆర్‌ఎస్‌ఎస్ భావజాలం, రాజ్యంగం అనే రెండు సిద్దాంతాల మధ్య యుద్దం జరుగుతోందని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ఆయోధ్యలో బాలరాముడి ప్రతిష్ట జరిగిన రోజే ఈ దేశానికి నిజమైన స్వతంత్ర వచ్చిందని ఇటీవల ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్‌జీ భగవత్ చేసిన వ్యాఖ్యాలపై రాహుల్ గాంధీ మండిపడ్డారు. 1947లో దేశానికి స్వతంత్రం రాలేదన్నట్లు గా భగవత్ మాట్లాడి భారత పౌరులు అందరినీ అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జాతీయ జెండాకు నమరస్కారం చేయని వారు కూడా దేశం గురించి మాట్లాడుతున్నారని రాహుల్ గాంధీ మోహన్ భగవత్‌ని ఉద్దేశించి వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. స్వత్రంత్ర పోరాటాన్ని కించపరిచే విధంగా మోహన్ భగవత్ వ్యాఖ్యలు ఉన్నాయని అన్నారు. ఇకపై కూడా ఆర్ఎస్‌ఎస్ ఐడియాలజీతో పోరాడుతూనే ఉంటామని ప్రకటించారు. బ్రిటీష్ వారితో పోరాడిన యోధునలను అవమానించేలా ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ వ్యాఖ్యానించడం బాధాకరమన్నారు. ఈ ఏఐసీసీ నూత భవనం ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు చెందుతుందని వెల్లడించారు. దర్యాప్తు సంస్ధలను రాజకీయ ప్రత్యర్ధులపై ఉపయోగిస్తున్నారని కేంద్రప్రభుత్వ తీరుపై వ్యఖ్యచేశారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయి అన్న రాహుల్ గాంధీ లోక్‌సభ ఎన్నికల సమయం కంటే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమయానికి ఓటర్ల సంఖ్య బాగా పెరిందని ఎత్తిచూపారు.