27.3 C
Hyderabad
Thursday, September 17, 2026

Live Video

spot_img

విశాఖలో రూ. 2 లక్షల కోట్ల అభిద్ధి పనులు

– మోదీ చేతుల మీదుగా శంకుస్థాపన
– బాబు, పవన్ కళ్యాణ్ తో కలిసి భారీ రోడ్ షో
– ప్రధాని పర్యటన ద్రష్ట్యా విస్తృత ఏర్పాట్లు

విశాఖపట్నానికి నూతన శోభ వచ్చింది. దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఎయిర్ పోర్టులో దిగారు. ఆయనకు సీఎం చంద్రబాబు, ఉన్నతాధికారులు సాదర స్వాగతం పలికారు. ఈ నేపథ్యంలో విశాఖలో రూ.2 లక్షల కోట్లకు పైగా విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. వాటిలో ముఖ్యంగా రైల్వే జోన్, పారిశ్రామిక హబ్, గ్రీన్ హైడ్రోజన్ హబ్, బల్క్ డ్రగ్ పార్క్ తదితర పలు ప్రాజెక్టులున్నాయి.

ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అందరూ కలిసి ఓపెన్ టాప్ జీపులో భారీ రోడ్ షో నిర్వహించారు. విశాఖపట్నంలోని సిరిపురం కూడలి నుంచి బహిరంగ సభావేదిక అయిన ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానం వరకు రోడ్ షో జరిగింది. ప్రజలు ఘన స్వాగతం పలికారు.

అనంతరం భారీ బహిరంగ సభా వేదిక వద్దకు ప్రధాని చేరుకున్నారు. రాష్ట్ర ప్రజల తరఫున అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ స్వాగతం పలికారు. తదుపరి వేదికపైకి చేరిన అనంతరం ప్రధానికి సత్కార కార్యక్రమాలు జరిగాయి. ప్రత్యేకంగా చేయించిన శేషశయనుడి విగ్రహం, అరకు కాఫీ కిట్ ను సీఎం చంద్రబాబు బహుకరించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ జస్టిస్ నజీర్, మంత్రి నారా లోకేశ్, ఎంపీలు భరత్, పురంధేశ్వరి, పలువురు రాష్ట్రమంత్రులు, ఎమ్మెల్యేలు సభకు హాజరయ్యారు

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com