మితిమీరిన వేగం ముగ్గురు స్నేహితుల ప్రాణాలు తీసింది. ఆరాంఘర్ నుంచి బహదూర్‌పురా వరకూ నిర్మించిన నూతన ఫ్లైఓవర్‌పై ఈ దుర్ఘటన జరింగింది. బహదూర్‌పురాకు చెందిన ముగ్గురు మైనర్ బాలురు ట్రిపల్ రైడింగ్ చేస్తూ అతివేగంగా ఫైఓర్ మీద ఎలక్రిటిక్ పోల్‌ని ఢీకొని అదుపుతప్పి మరోసారి డివైడర్‌ను కూ ఢీకొట్టి చెల్లాచెదురుగా పడిపోయారు. ఈ ప్రమాదంలో ఇద్దరు మైనర్లు స్పాట్‌లో మృతి చెందగా, మరో బాలుడు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో చనిపోయాడు. ఈ ముగ్గురు మైనర్లు ఒకే బండిపై సోమవారం రాత్రి బహదూర్‌పురా నుంచి ఆరామ్‌ఘర్ వైపు వెళుతున్నారు. ఈ క్రమంలో శివరాంపల్లి సమీపంలోకి రాగానే ఎలక్ట్రిక్ పోల్‌ను ఢీకొని డివైడర్‌ను కూడా ఢీకొట్టారు. ఇద్దరు మైనర్ల మృతదేహాలు ఫ్లైఓవర్ పై చెల్లాచెదురుగా పడిపోయాయి. అందివచ్చిన కుమారు అకాల మరణం చెందడంతో ముగ్గురు మైనర్ల కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మితిమీరిన వేగం, ట్రిపుల్ రైడింగే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు చెపుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.