– రేట్ల పెంపు సరైనదేనని కామెంట్
బట్టలు, ఖరీదైన వస్తువులు, బ్రాండెడ్ ప్రోడక్ట్స్ కొనడానికి లేని ఏడుపు సినిమా టిక్కెట్ల ధరల మీద పడి ఏడుస్తున్నారెందుకు అంటున్నారు సెన్సేషనల్ డైరెక్టర్ రాం గోపాల్ వర్మ. అల్లు అర్జున్ కథానాయకుడిగా నటించిన పుష్ప2 మూవీ టిక్కెట్ ధరల పెంపుపై ఆర్జీవీ ఈ కామెంట్లు చేశారు. పుష్ప2 సినిమా టిక్కెట్ ధరలను పెంచుకునేందుకు అనుమతిస్తూ తెలుగు రాష్ట్రాలు ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసినదే. పెరిగిన రేట్లపై కొన్ని సామాజిక వర్గాలు అసహనం వ్యక్తం చేశాయి. ధరలను తగ్గించాలంటూ కొందరు కోర్టుకు కూడా వెళ్లారు. ఈ సందర్బంగానే ఆర్జీవీ రియాక్ట్ అయ్యారు. పుష్ప2 టిక్కెట్ రేట్లను ఆర్జీవీ స్టార్ హోటల్ ఇడ్లీతో పోల్చారు. ఉదాహరణకి సుబ్బారావు స్టార్ హోటల్‌లో ఇడ్లీల రేట్లు అంత విలువైనవని నమ్మినప్పుడే ఆ హోటల్ అంత రేట్లు పెడుతుందని అన్నారు. అంత మాత్రాన ఆ స్టార్ హోటల్ ధరలు సామాన్యులకు అందుబాటులో లేవని అనలేమని అన్నారు. ఇది సెవెన్ స్టార్ హోటల్‌లో సామాన్యులకు చోటు లేదు అని ఏడ్చినంత వెర్రితనం అని పోల్చారు.సెవెన్ స్టార్ హోటల్‌లో యాంబియెన్స్‌కి ఆ రేటు ఇవ్వచ్చు అనుకున్నప్పుడు పుష్ప2 విషయంలో ఆ క్వాలిటీకి, టేకింగ్‌కే అంత రేట్ పెట్టొచ్చని అభిప్రాయపడ్డారు. డెమోక్రటిక్ క్యాపిటలిజం అనేది క్లాస్ డిఫరెన్స్ మీదే పనిచేస్తుందని,సినిమాలను కూడా అన్ని ప్రోడక్ట్స్ లాగే లాభాలకే తీస్తారని ప్రజా సేవ కోసం కాదని ఆర్జీవి కామెంట్ చేశారు.
ఇల్లు, తిండి, దుస్తులు ఈ మూడింటికన్నా ఎంటర్‌టైన్‌మెంట్ అవసరమా ? అలా అయితే ఈ మూడు నిత్యావసరాల ధరలు బ్రాండింగ్ ఉన్నప్పుడు, ఆ రేట్లు ఆకాశాన్నంటుతున్నప్పుడు పుష్ప2 సినిమా రేట్లు అంతకన్నా తక్కువగానే ఉన్నాయని ఫీలయ్యారు. రేట్లు ఎక్కువ అనుకునే వారు అవి తగ్గాక చూడోచ్చని సలహా ఇచ్చారు. పుష్ప2ని సుబ్బారావు స్టార్ హోటల్‌తో పోల్చిన ఆర్జీవీ ఇడ్లీ ధర ఇప్పటికే వర్కవుట్ అయ్యిందని దానికి ప్రూఫ్ ఏంటంటే సుబ్బారావు హోటల్లో ఎక్కడా కూర్చునే చోటు దొరకడం లేదు. అన్ని సీట్లు బుక్ అయిపోయాయి అని నర్మగర్భంగా పోస్ట్ చేశారు ఆర్జీవి.