అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే రంగంలోకి దిగినట్టు కనిపిస్తోంది. కెనడా ప్రధానితో భేటీ అయ్యాడు.. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీతో సమావేశమయ్యాడు.. మొత్తానికి కీలక నిర్ణయాలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేస్తున్నాడు. ట్రంప్ అధికారం చేపట్టగానే రష్యా-ఉక్రెయిన్ యుద్దానికి ఎండ్ కార్డ్ పడటం స్టార్టవుతుందని క్లియర్ కట్‌గా అర్థమవుతుంది. అందుకే ఈలోపు చేయాల్సిన సాయమంతా చేసేస్తున్నాడు ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్. రీసెంట్‌గా మరో బిలియన్ డాలర్ల సాయం చేశాడు. ఇక అమెరికా అనేక దేశాలకు అనేక రాయితీలు ఇస్తుంది. ఇందులో కెనడా, మెక్సీకోలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ట్రంప్ ఈ రెండు దేశాలపై ఫోకస్ చేశారు. మీకు ఇన్ని రాయితీలు ఇవ్వడం ఎందుకు? మీరు మీ దేశాలను USAలో విలీనం చేసేయొచ్చు కదా అని అడిగేస్తున్నాడు.
కెనడాకు ఏడాదికి 100 బిలియన్ డాలర్లకు పైగా రాయితీలు ఇస్తుంది అమెరికా. అంటే మన కరెన్సీలో లెక్కేస్తే అటు ఇటుగా 8 లక్షల కోట్లకు పైగానే.. ఇక మెక్సికోకు అయితే ఏకంగా 300 బిలియన్ డాలర్ల సాయం చేస్తోంది.. దీన్ని కూడా మన రూపాయల్లో లెక్కిస్తే అక్షరాలా 24 లక్షల కోట్లకు పైగా. అందుకే ఈ రెండు దేశాలకు ప్రతి ఏడాది ఇన్ని లక్షల కోట్లు ఎందుకు ఇవ్వాలి.. మీరు కూడా అమెరికాలో విలీనమైతే సరిపోతుంది కదా అంటున్నారు ట్రంప్. నిజానికి కెనడాకు కత్తెర్లు తప్పవని ఎప్పటి నుంచో వార్నింగ్స్ ఇస్తున్నారు ట్రంప్. రీసెంట్‌గా కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోతో భేటీ అయినప్పుడు కూడా ఈ అంశంపై చర్చించినట్టు తెలుస్తోంది. వలసలు, డ్రగ్స్ అక్రమ రవాణా కట్టడి చేయడంలో ఫెయిలైతే.. USAలో విలీనమవ్వండి.. మిగిలినది మేం చూసుకుంటామని సెటైర్లు వేశారట ట్రంప్.
అంతేకాదు ఇప్పటి వరకు అమెరికాలో ఓ రూల్ ఉంది. అక్కడ ఎవరు జన్మించిన వారికి అమెరికా పౌరసత్వం ఇస్తారు. అందులో అమెరికన్స్ ఉన్నా.. ఇతర దేశస్థులు ఉన్నా ఇదే రూల్ వర్తిస్తుంది. అయితే అధికారం చేపట్టగానే దీనిపై ఫోకస్ పెట్టనున్నారు ట్రంప్. అంతేకాదు నాలుగేళ్లలో అమెరికాలోని అక్రమ వలసదారులను దేశం దాటిస్తానని తేల్చి చెబుతున్నారు. సో ట్రంప్ అధికారం చేపట్టినప్పటి నుంచి కొత్త కొత్త విషయాలు చూడబోతున్నామనడంలో ఎలాంటి డౌట్లు లేవు.
ట్రంప్ 2.0(రెండో దఫా) పాలన ప్రపంచరాజకీయాల్లో విప్లవాత్మక మార్పులకు దారితీస్తుందని… అమెరికా చరిత్రలో ట్రంప్ శకం చిరస్థాయిగా నిలిచే అవకాశాలు ఉన్నాయని అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.