24.9 C
Hyderabad
Wednesday, August 12, 2026

Live Video

spot_img

లగచర్ల ఫార్మా భూసేకరణ రద్దు

గిరిజన, దళిత పేద రైతులకు మద్దతుగా బీఆర్‌ఎస్‌ చేసిన పోరాటంతో రేవంత్‌ రెడ్డి సర్కార్‌ దిగొచ్చింది. లగచర్ల భూసేకరణను నిలిపివేసింది. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. లగచర్ల ఫార్మాపై అభిప్రాయ సేకరణకు వెళ్లిన కలెక్టర్‌, అధికారులపై దాడులు జరిగాయి. రైతుల దాడి ఘటనను ముందుగా పసిగట్టలేకపోవడం నిఘా వైఫల్యమేనన్న విమర్శలు వెల్లువెత్తాయి. లగచర్ల ఘటన అనంతరం అరెస్టులు, పోలీసుల మోహరింపులతో పరిస్థితి ఇంకా ఉద్రిక్తంగానే ఉన్నది. అర్ధరాత్రి వేళ రేవంత్‌ సర్కార్‌ అండతో పోలీసులు చేసిన దమనకాండతో రాష్ట్రం అట్టుడికింది. దీంతో బాధితులకు బీఆర్‌ఎస్‌ అండగా నిలిచింది. వారిని జాతీయ మానవ హక్కుల కమిషన్‌ దగ్గర వరకూ తీసుకెళ్లింది. ఈ క్రమంలోనే ఎన్‌హెచ్‌ఆర్సీ దీనిపై విచారణ కూడా చేపట్టింది.

ఈ తరుణంలో ఫార్మా సెజ్ ఏర్పాటుపై ఆందోళన తీవ్ర రూపం దాల్చి ఉద్యమ స్థాయికి చేరుతోంది. ఆందోళనకారులకు విపక్షాలు బాసటగా నిలిచి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్నాయి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com