తెలుగులో మరో హార్ట్ టచింగ్ మూవీ రాబోతోంది. కమల్ క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్దేష్ దర్శకత్వంలో, డా. ఉమారావు నిర్మాణంలో సత్యప్రకాష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న మూవీ ‘నాన్నా మళ్లీ రావా..!’. సత్యప్రకాష్, ప్రభావతి, రిత్విక్, హరీక, శిరీష తదితరులు నటించిన ఈ చిత్రం ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుని తుది మెరుగులు దిద్దుకుంటోంది.
ఈ సందర్భంగా దర్శకుడు నిర్దేష్ మాట్లాడుతూ.. ”వెంకన్న క్యారెక్టరే నన్ను ఈ కథ రాయించినట్టు అనిపించింది. నాన్న అంటే ప్రతి ఒక్కరికి చెప్పుకోలేనంత భావోద్వేగం ఉంటుంది. థియేటర్‌లో ఈ సినిమా చెప్పలేనంత భావోద్వేగంతో ప్రేక్షకులను కట్టిపడేస్తుందని మాత్రం కచ్చితంగా చెప్పగలను..” అని అన్నారు.
తెలుగు ప్రేక్షకులకు పూర్తిస్థాయిలో నచ్చే సబ్జెక్టుతో ఈ సినిమా తెరకెక్కినట్టు ఈ చిత్ర నిర్మాత డా. ఉమారావు ధన్యవాదాలు చెప్పారు. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని త్వరలోనే విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు.