33.9 C
Hyderabad
Wednesday, June 3, 2026

Live Video

spot_img

ట్రిపుల్‌ ఆర్‌, రోడ్లపై రేవంత్‌రెడ్డి సమీక్ష

తెలంగాణలో కొనసాగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. సచివాలయంలో మంత్రులు, సంబంధిత అధికారులతో సీఎం భేటీ అయ్యారు. నూతనంగా నిర్మించబోతున్న రీజినల్‌ రింగ్‌రోడ్డు సహా ఆర్‌ అండ్‌బీ, నేషనల్‌ హైవే ప్రాజెక్టులపై సమీక్షించారు. ఈ కార్యక్రమానికి ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కొండా సురేఖ, సీతక్క, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్ రెడ్డి రాంరెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, వివిధ శాఖల ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రతిపాదిత ప్రాజెక్టులు, వాటి పురోగతి, అడ్డంకులు సహా అన్ని అంశాలపైనా సమగ్ర సమాచారాన్ని తెప్పించుకున్న సీఎం అధికారులతో సమస్యలను అధిగమించేందుకు ఉన్న మార్గాల గురించి చర్చించారు. అలాగే, కేంద్ర ప్రభుత్వానికి పంపాల్సిన నివేదికలు, పెండింగ్‌లో ఉన్న అంశాల విషయంలో అధికారులు వేగంగా అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.

 

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com