39.2 C
Hyderabad
Saturday, May 2, 2026

Live Video

spot_img

రాములోరి కల్యాణానికి రేవంత్‌, భట్టి, తుమ్మలకు ఆహ్వానం

భద్రాచలం శ్రీ సీతారామ చంద్ర స్వామి తిరు కల్యాణ బ్రహ్మోత్సవాల్లో పాల్గొనాల్సిందిగా ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వర్‌ రావుకు ఆహ్వాన పత్రికలు అందించారు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, భద్రాచలం దేవాలయ అర్చకులు, అధికారులు.

ఈ సందర్భంగా సీఎం రేవంత్‌, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులతో కలిసి .. భద్రాచలం శ్రీరామ నవమి బ్రహ్మోత్సవాల పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధికి సంబంధించి అవసరమైన భూసేకరణ, ఇతర వివరాల గుంచి అధికారులను అడిగి ముఖ్యమంత్రి వివరాలు తెలుసుకున్నారు. అలాగే, అవసరమైన భూసేకరణ, నిధులకు సంబంధించిన పూర్తి వివరాలు అందించాలని అధికారులను సీఎం ఆదేశించారు.

ఈ కార్య క్రమంలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజా రామయ్యర్, దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీధర్, భద్రాచలం ఆలయ ఈవో రమాదేవి, ఆలయ అర్చకులు తదితరులు పాల్గొన్నారు.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com