26.7 C
Hyderabad
Sunday, April 19, 2026

Live Video

spot_img

చంచల్ గూడ సికా పరేడ్ గ్రౌండ్‌లో ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు

చంచల్ గూడ సికా పరేడ్ గ్రౌండ్‌లో రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా జాతీయ పతాకవిష్కరణ చేశారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో గార్డ్స్, ప్లాటూన్స్ పరేడ్‌లో గౌరవ వందనం స్వీకరించారు. ఆ తర్వాత విధినిర్వహణలో అత్యంత ప్రతిభ కనబరచిన పోలీసు అధికారులకు ప్రతిభా పూరస్కారాలు, నగదు అవార్డులు ప్రదానం చేశారు. భారత గణతంత్రం ఘనమైనదని, మన దేశ ఔన్నత్యాన్ని ప్రపంచ దేశాలకు చాటాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా డీజీ సౌమ్యమిశ్రా సూచించారు. చర్లపల్లి జైలు సూపరింటెండెంట్‌ జి. రామచంద్రానికి బెస్ట్ సర్వీసెస్ కి గాను 15 వేల రూపాయల నగదు ప్రోత్సాహకాన్ని డైరెక్టర్ జనరల్ సౌమ్యా మిశ్రా అందచేశారు. అలాగే, 2023వ సంవత్సరానికి సంబంధించి తెలంగాణ జైళ్ళ శాఖలో ఉత్తమ సేవలు అందించినందుకు రాష్ట్రపతి సేవాపతకం కూడా రామచంద్రం అందుకున్నారు. ఈ కార్యక్రమంలో జైళ్ల శాఖ ఐజిలు వై. రాజేష్, ఎన్. మురళీబాబు, డిఐజిలు శ్రీనివాస్, ఎం. సంపత్ తదితరులు పాల్గొన్నారు.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com