నన్ను ఎవరూ కొట్టలేదు.. కానీ మానసికంగా వేధించారు.. తిట్టారు.. అంటూ కన్నీరు పెట్టుకున్నారు గోల్డ్ స్మగ్లింగ్ కేసులో అడ్డంగా దొరికిపోయిన కన్నడ యాక్టర్ రన్యారావు. DRI కస్టడీ ముగిసిన తర్వాత కోర్టులో హాజరుపరచగా కన్నీటి పర్యంతమయ్యారు రన్యారావు. తనను కొట్టడం లేదు కానీ.. DRI అధికారులు తనను మానసికంగా వేధించారని, సమాధానాలు చెప్పకపోతే తిట్టారని ఆమె కోర్టుకు తెలిపారు.
14 కిలోల బంగారం స్మగ్లింగ్ చేస్తూ అడ్డంగా దొరికిపోయింది రన్యారావు. ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ చేస్తున్న డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు ఆమె నుంచి కీలక వివరాలు తీసుకునేందుకు ప్రయత్నించినా ఆమె నుంచి ఎలాంటి సమాధానాలు రావడం లేదంటున్నారు DRI అధికారులు. తాము రన్యారావుతో హద్దు మీరి ప్రవర్తించలేదని.. ఎలాంటి వేధింపులకు గురి చేయలేదన్నారు. అవసరమైతే సీసీ ఫుటేజీ పరీశిలించుకోవచ్చంటూ కోర్టుకు తెలిపారు.
రన్యారావు లాయర్‌పై ఆగ్రహం
కోర్టులో వాదనలు కొనసాగుతున్న సమయంలో పదే పదే అడ్డు పడిన రన్యారావు లాయర్‌పై జడ్జి ఆగ్రహం వ్యక్తం చేశారు. రన్యారావు సమాధానాలు చెబుతున్న సమయంలో అడ్డుకుంటుండటంతో జడ్జి ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు 30 నిమిషాల పాటు రన్యారావు తన తరపు న్యాయవాదులతో చర్చించింది. అప్పుడు ఈ విషయాలు మీకు చెప్పలేదా అని ప్రశ్నించారు. రన్యారావు కూడా జడ్జి చాలా విషయాల్లో క్లారిటీ ఇచ్చారు. విచారణ మొత్తం రికార్డింగ్ అవుతుందన్నారు. విచారణ సమయంలో భయపడాల్సిన అవసరం లేదన్నారు. అంతేకాదు విచారణలో ఏమైనా ఇబ్బందులు ఉంటే మీ లాయర్‌తో పిటిషన్ వేయించవచ్చన్నారు జడ్జి. విచారణ అనంతరం ఈ నెల 24 వరకు జ్యూడిషియల్ కస్టడీ విధిస్తూ స్పెషల్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.