మియామి ఫార్ములా వన్ గ్రాండ్ ప్రిక్స్ ఈ ఏడాది వేడుకల్లో ఓ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భారతీయ నటుడు, ఎంటర్ప్రెన్యూర్ రానా దగ్గుబాటి తన టకీలా బ్రాండ్ “లోకా లోకా” ప్రమోషన్ కోసం మియామి వెళ్లి, అక్కడి హై-ప్రొఫైల్ పార్టీల్లో పాల్గొన్నారు. హాలీవుడ్ హిప్హాప్ దిగ్గజాలు 50 సెంట్స్, ఫ్లో రిడా, ఆస్కార్ అవార్డు గ్రహీత క్యూబా గూడింగ్ జూనియర్‌తో కలిసి రానా సందడి చేయడం మియామి నైట్‌లైఫ్‌ను మరింత హైలైట్ చేసింది.
ఈ ఎక్స్‌క్లూజివ్ ఈవెంట్లో రానా తన బిజినెస్ పార్ట్నర్స్ అయిన సంగీత దర్శకుడు అనిరుధ్, ఎంటర్ప్రెన్యూర్ హర్ష వడ్లమూడితో కలిసి పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా తరలి వచ్చిన సెలబ్రిటీలు, రేసింగ్ లవర్స్, వ్యాపార ప్రముఖులతో ఈ పార్టీ ఒక గ్లోబల్ నెట్వర్కింగ్ స్పేస్‌గా మారింది. లోకా లోకా బ్రాండ్ ఉత్సాహాన్ని పెంచేలా చేసిన ఈ ఈవెంట్లో 50 సెంట్స్ తన లైవ్ పెర్ఫార్మెన్స్తో ఊపందించారు.
రానా బ్యాక్‌స్టేజ్‌లో 50 సెంట్స్తో చిట్‌చాట్ చేయడం, క్యూబా గూడింగ్ జూనియర్‌తో కలసి నవ్వుతూ కనిపించడం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ దృశ్యాలు భారతీయ క్రియేటివిటీకి, గ్లోబల్ లైఫ్‌స్టైల్ కల్చర్‌కి మధ్య గ్రేట్ కాంబినేషన్‌గా నిలిచాయి.
ఇండియన్ బ్రాండ్లను అంతర్జాతీయంగా నిలబెట్టాలన్న రానా దృష్టిని లోకా లోకా స్పష్టంగా ప్రతిబింబిస్తోంది. ఆయన కంటెంట్, లైఫ్‌స్టైల్ బిజినెస్ ద్వారా భారత్ టాలెంట్‌ను గ్లోబల్ ప్లాట్‌ఫామ్స్‌కు పరిచయం చేస్తున్న తీరుతో, ఈవెంట్లో పాల్గొన్న అతన్ని ‘లైఫ్ స్టైల్ కల్చరల్ బ్రిడ్జ్’గా అభివర్ణిస్తున్నారు.