ఢిల్లీ క్యాపిటల్స్ హ్యాట్రిక్ విక్టరీ కొట్టింది. సొంత గడ్డపై చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓడించింది. 184 పరుగుల టార్గెట్‌ను చేధించలేకపోయారు చెన్నై బ్యాటర్లు. 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 158 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో 25 పరుగుల తేడాతో DC గెలవగా.. ఈ సీజన్‌లో చెన్నైకి బ్యాడ్‌లక్ కంటిన్యూ అయ్యిందనే చెప్పాలి.
మొదట బ్యాటింగ్ చేసిన DCకి ఆదిలోనే షాక్ తగిలింది. అసలు పరుగుల ఖాతా ఓపెన్ చేయకముందే జేక్ డకౌట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత రాహుల్, అభిషేక్ పోరెల్ ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. ఏడో ఓవర్‌లో అభిషేక్ 33 పరుగులవద్ద ఔటయ్యాడు. మరోవైపు రాహుల్ మాత్రం చలరేగిపోయాడు మూడు సిక్స్‌లు, నాలుగు ఫోర్లు బాది 77 పరుగులు చేశాడు. ఆ తర్వాత అక్షర్, సమీర్, స్టబ్స్ తలో 20 పరుగులు చేయడంతో 20 ఓవర్లలో ఢల్లీ 6 వికెట్లు కోల్పోయి 183 పరుగులు చేసింది. చెన్నైలాంటి స్లో పిచ్‌లో ఈ స్కోర్ ఎక్కువే అని చెప్పాలి.
184 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన చెన్నైకి కూడా ఆదిలోనే షాక్ తగిలింది. రచిన్ రవీంద్ర 3 పరుగులకే వెనుదిరిగాడు. కాన్వే, రుతురాజ్ కూడా పెద్దగా ఆడలేదు. విజయ్ శంకర్ మాత్రం 69 పరుగులతో నాటౌట్‌గా నిలిచి కాస్త పోరాడాడు. ఈసారి ముందుగానే క్రీజులోకి వచ్చిన ధోని కూడా ఎలాంటి మెరుపులు చూపించలేదు. కేవలం ఒక ఫోర్, ఒక సిక్స్ బాదాడు. దీంతో లక్ష్యం పెరుగుతూ, బాల్స్ తగ్గుతూ వచ్చాయి. వికెట్ పోకుండా మ్యాచ్‌ను ముగించినా ఓటమి మాత్రం తప్పలేదు CSKకి.
ఈ మ్యాచ్‌లో గెలుపు, ఓటముల్లో కూడా ఓ విశేషం ఉంది. ఇది చెన్నైకి హ్యాట్రిక్ ఓటమి కాగా.. ఢిల్లీకి హ్యాట్రిక్ విక్టరీ.