మేషం… (అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం)
కొత్త పనులు చేపట్టి సజావుగా పూర్తి చేయడంలో విజయం సాధిస్తారు.ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు.మిత్రుల సహాయం కోసం యత్నిస్తారు.ఆత్మవిశ్వాసంతో కొన్ని వ్యతిరేక పరిస్థితులను అనుకూలంగా మలచుకుంటారు.ఆస్తుల వ్యవహారాలలో సమస్యల పరిష్కారంలో మరింత చొరవ చూపుతారు.ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.నిరుద్యోగులకు ఉద్యోగయోగం.ఎటువంటి అవసరం వచ్చినా డబ్బుకు ఇబ్బంది లేకుండా గడుపుతారు. బంధువులు కూడా కొంత ఆదుకుని చేయూతనిస్తారు. కుటుంబసభ్యుల ఆకాంక్షలకు అనుగుణంగా మసలుకుంటూ మన్ననలు పొందుతారు. అలాగే, సోదరుల సలహాలతో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. వృత్తులు, వ్యాపారాలలో ఎటువంటి రాజీలేకుండా సజావుగా నడిపించడంలో విజయం సాధిస్తారు. సాంకేతిక నిపుణులు, పారిశ్రామికవేత్తలు, కళాకారులకు చికాకులు తొలగుతాయి. 09,10 తేదీల్లో దూరప్రయాణాలు. మానసిక ఆందోళన. శ్రమ పెరుగుతుంది. దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.
వృషభం… (కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, వృగశిర 1,2 పాదాలు)
ఎంతగా కష్టపడ్డా అనుకున్న వ్యవహారాలను పూర్తి చేయడం కష్టసాధ్యం. వ్యయప్రయాసలు అధికమవుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపడతారు. ప్రస్తుత పరిస్థితులు కొంత వ్యతిరేకంగా ఉండడం కొంత ఇబ్బంది కలిగిస్తుంది. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆస్తి వివాదాలు పరిష్కారంలో ఎంత∙చొరవ చూపినా ఫలితం కనిపించదు. ఇంటి నిర్మాణయత్నాలలోనూ ఆటంకాలు ఎదురవుతాయి. చిరకాల మిత్రులతో మనస్సులోని ఆలోచనలు పంచుచకుంటారు. చిత్రమైన సంఘటనలు ఎదురుకావచ్చు. ఆదాయం విషయంలో ఇబ్బందులు పడతారు. రుణాలు కోసం యత్నాలు సాగిస్తారు. కుటుంబంలో అకారణంగా తగాదాలు నెలకొంటాయి. సోదరుల నిర్ణయాలు వ్యతిరేకిస్తారు. ఆరోగ్యపరంగా సమస్యలు ఎదురుకావచ్చు. వృత్తులు, వ్యాపారాలలో ఎటువంటి తొందరపాటు లేకుండా అడుగులు వేయండి. క్రీడాకారులు, పారిశ్రామిక, రాజకీయవేత్తలకు అంచనాలలో పొరపాట్లు దొర్లి సమస్యలు ఎదురవుతాయి. 07,08 తేదీల్లో శుభవర్తమానాలు. ధనలబ్ధి. ప్రముఖులతో పరిచయాలు. శివాష్టకం పఠించండి.
మిథునం… (మృగశిర 3,4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పాదాలు)
ఎటువంటి కార్యక్రమమైనా వేగంగా పూర్తి చేస్తారు. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. విద్యార్థుల యత్నాలు ఫలిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ సమర్థత, ప్రతిభ వెలుగులోకి వస్తాయి. కాంట్రాక్టులు సాధిస్తారు. ఆస్తుల వ్యవహారాలలో చిక్కుముడులు తొలగుతాయి. పరిస్థితులను అనుకూలంగా మలచుకుని తదనుగుణంగా అడుగులు వేస్తారు. ఆర్థికంగా ఇబ్బందులు తీరి ఊరట చెందుతారు. అవసరాలకు స్నేహితులు కొందరు ఆదుకుంటారు. కుటుంబంలో సంతోషకరంగా గడుపుతారు. పెద్దల సలహాలు , సూచనలతో నిర్ణయాలు తీసుకుంటారు. ఎవరినీ నొప్పించకుండా మసలుకుంటూ వారి మన్ననలు పొందుతారు. వృత్తులు, వ్యాపారాలలో మీ అంచనాలు నిజం చేసుకుంటారు. అయితే ఆవేశంతో నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తపడండి. రాజకీయవేత్తలు, కళాకారులు, క్రీడాకారులకు మరింత సంతోషదాయకంగా ఉంటుంది. 10,11 తేదీల్లో ఖర్చులు అధికం. ఆకస్మిక ప్రయాణాలు. బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.
కర్కాటకం… (పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష)
అనుకున్న వ్యవహారాలు కష్టసాధ్యమైనా పూర్తి చేస్తారు. ఆలోచనలు అమలు చేస్తారు. మిత్రులు, సన్నిహితులతో విభేదాలు పరిష్కరించుకుంటారు. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఆకట్టుకుంటాయి. ఎదుటవారిని ఆకట్టుకోవడంలో మీకు మీరే సాటి అని నిరూపించుకుంటారు. ఆస్తుల తగాదాలు ఒక కొలిక్కి తేవడంలో ప్రముఖ పాత్ర పోషిస్తారు. ఒక సమాచారం విద్యార్థులకు వరంగా మారుతుంది. వాహనాలు, ఆభరణాలను కొనుగోలు చేస్తారు. పరిచయాలు మరింత పెరుగుతాయి. అవసరాలు పెరిగినా డబ్బుకు ఇబ్బంది లేకుండా గడిచిపోతుంది. రుణదాతల నుంచి ఒత్తిడులు తగ్గుతాయి. స్థిరాస్తుల విక్రయాలలో కొంత లాభపడతారు. మీమాటకు కుటుంబసభ్యులు ఎంతో విలువ ఇస్తారు. గతంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలపై తిరిగి ఆలోచన చేస్తారు. ఆరోగ్యం. కొంత మెరుగుపడి ముఖ్య వ్యవహారాలను పూర్తి చేస్తారు. వృత్తులు, వ్యాపారాలలో ముందడుగు వేసి అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు. వైద్యులు, క్రీడాకారులు, సాంకేతిక నిపుణులు తమ ప్రతిభను నిరూపించుకునే సమయం. 06,07 తేదీల్లో దుబారా ఖర్చులు. ఇతరుల విషయాలలో జోక్యం వద్దు. ఆకస్మిక ప్రయాణాలు. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.
సింహం… (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం)
నూతనోత్సాహం, పట్టుదలతో కార్యక్రమాలు పూర్తి చేస్తారు. స్నేహితులతో వివాదాలు కాస్త సర్దుకుంటాయి. ఎంతోకాలంగా ఇబ్బంది పెడుతున్న చికాకులు తొలగుతాయి. ఆలోచనలు అమలుకు సమాయత్తమవుతారు. కాంట్రాక్టులు దక్కించుకునేందుకు మరింత యత్నిస్తారు. శుభకార్యాల నిర్వహణపై అప్తులతో చర్చిస్తారు. వాహనాలు, స్థలాలు కొనుగోలు యత్నాలు నెరవేరతాయి. ఆదాయానికి ఇబ్బంది లేకుండా గడిచిపోతుంది. అయితే ఇతరుల నుండి రావలసిన సొమ్ములు ఆలస్యమవుతాయి. బంధువులతో ఆనందాన్ని పంచుకుంటారు. వారి నిర్ణయాలపై సంతోషం వ్యక్తం చేస్తారు. గత కొంతకాలంగా ఇబ్బంది పెడుతున్న ఆరోగ్యం కుదుటపడుతుంది. వృత్తులు,వ్యాపారాలలో మీ సమర్థత చాటుకుని మంచి గుర్తింపు పొందుతారు. వైద్యులు, రాజకీయవేత్తలు, కళాకారులకు అప్రయత్నకార్యసిద్ధి. 09,10 తేదీల్లో దూరప్రయాణాలు. మిత్రుల నుండి ఒత్తిడులు, సమస్యలు. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.
కన్య… (ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు)
ప్రస్తుతం నెలకొన్న పరిస్థితి నుండి గట్టెక్కుతారు. నిలిచిపోయిన కార్యక్రమాలు ఎట్టకేలకు పూర్తి కాగలవు. ఆలోచనలు కలసివచ్చి ఉత్సాహంగా గడుపుతారు. కొత్త వ్యక్తుల పరిచయాలు మీలో నూతనోత్సాహాన్నిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు తెచ్చుకుంటారు. కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు. ఆత్మవిశ్వాసం, పట్టుదలతో కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. సొమ్ముకు ఇబ్బందులు లేకుండా గడుపుతారు. ఆస్తుల విక్రయాల ద్వారా అనుకున్న సమయానికి సొమ్ము సమకూరుతుంది. కుటుంబసభ్యుల వైఖరి మొదట్లో కొంత ఇబ్బంది పెట్టినా క్రమేపీ సర్దుకుంటుంది. సోదరులతో మనస్పర్థలు తొలగుతాయి. ఆరోగ్యపరంగా మరింత మెరుగ్గా ఉంటుంది. వృత్తులు, వ్యాపారాలలో ఎటువంటి ఒత్తిడులు వచ్చినా ఎదుర్కొంటారు. పారిశ్రామిక, రాజకీయవేత్తలకు అన్ని విధాలా అనుకూలత. 08,09 తేదీల్లో దూరప్రయాణాలు. మీ కష్టం ఇతరులకు ఉపయోగిస్తుంది. నవగ్రహస్తోత్రాలు పఠించండి.
తుల… (చిత్త 3,4పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు)
కొత్త వ్యవహారాలు అనుకున్నట్లుగానే కొనసాగిస్తారు. మీ ఆత్మబలమే సమస్యల పరిష్కారంలో తోడ్పడుతుంది. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. సొంత ఆలోచనలతో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వ్యతిరేక పరిస్థితులు చక్కబడతాయి. వాహనాలు, ఆభరణాలను కొంటారు. కొత్త అగ్రిమెంట్లు చేసుకుంటారు. విద్యార్థులకు మరింత ఊరట లభిస్తుంది. డబ్బు సమకూరి ముఖ్యమైన అవసరాలు తీరతాయి. షేర్ల విక్రయాలు ఎట్టకేలకు పూర్తి చేసి స్వల్పంగా లబ్ధి పొందుతారు. కుటుంబంలో మీ అభిప్రాయాలకు అధిక ప్రాధాన్యత లభిస్తుంది. అందరి పట్ల ప్రేమపూర్వకంగానే మసలుకుంటారు. వృత్తులు, వ్యాపారాలను నిర్వహించడంలో యుక్తిగా వ్యవహరిస్తారు. కళాకారులు, వైద్యులు, సాంకేతిక నిపుణుల ఆశలు నెరవేరతాయి. 11,12 తేదీల్లో ఆరోగ్యం కొంత ఇబ్బందిగా ఉంటుంది. అనుకోని ఖర్చులు తప్పవు. శ్రీరాఘవేంద్రస్తోత్రాలు పఠించండి.
వృశ్చికం… (విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ)
కొత్త కార్యక్రమాలను సకాలంలో చేపట్టి పూర్తి చేస్తారు. అనుకున్న సమయానికి నిర్ణయాలు తీసుకుని అందర్నీ ఆశ్చర్యపరుస్తారు. సంఘంలో కీర్తిగడిస్తారు. విద్యార్థుల యత్నాలు ఫలిస్తాయి. ఆత్మీయుల నుంచి శుభవర్తమానాలు అందుతాయి. నిరుద్యోగుల సుదీర్ఘ నిరీక్షణ ఫలిస్తుంది. పట్టుదలతో సమస్యలను ఎదుర్కొంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. రావలసిన డబ్బు అందుతుంది. ఎటువంటి అవసరమైనా తీరి ఉపశమనం పొందుతారు. కుటుంబసభ్యులతో సత్సంబంధాలు నెలకొంటాయి. బంధువర్గం నుండి ఆశించిన సహాయం లభిస్తుంది. ఆస్తుల విషయంలో చిక్కులు తొలగుతాయి. వృత్తులు, వ్యాపారాలను సక్రమంగా నిర్వర్తించడంలో సఫలమవుతారు. క్రీడాకారులు, పారిశ్రామికవర్గాలు, కళాకారులకు అనుకూల సమయం. 06,07 తేదీల్లో ధనవ్యయం. మానసిక ఆందోళన. ఆరోగ్యం సహకరించక ఇబ్బందిపడతారు. ఇంద్రాక్షిస్తుతి మంచిది.
ధనుస్సు… (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం)
క్రమేపీ పరిస్థితులు అనుకూలించి అడుగు వేస్తారు. ముఖ్యమైన కార్యక్రమాలు సకాలంలో చక్కదిద్దుతారు. మీ ఆలోచనల అమలుకు కార్యాచరణ సిద్ధంచేసుకుంటారు. స్థిరాస్తి విషయంలో నెలకొన్న ఇబ్బందులు తొలగుతాయి. కాంట్రాక్టులను పోటీని అ«ధిగమించి దక్కించుకుంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శనలో బిజీగా గడుపుతారు. అందరిలోనూ పలుకుబడి మరింత పెరుగుతుంది. కొత్త వ్యక్తులు పరిచయమై మాటసాయం అందిస్తారు. కొంత సొమ్ము అనుకోకుండా దక్కుతుంది. రుణబాధలు చాలావరకూ తొలగుతాయి. స్థిరాస్తి విక్రయాల ద్వారా అదనపు సొమ్ము సమకూరే అవకాశం. కుటుంబంలో మీ నిర్ణయమే అందరూ పాటిస్తారు. భార్యాభర్తల మధ్య మనస్పర్థలకు తెరపడుతుంది. ఆరోగ్యం మెరుగై ఉపశమనం పొందుతారు. వృత్తులు, వ్యాపారాలను ఒక పద్ధతి ప్రకారం నిర్వహించి మీకు సాటిలేరని నిరూపించుకుంటారు. క్రీడాకారులు, సాంకేతిక నిపుణులు, పారిశ్రామికవర్గాలకు మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది. 09,10 తేదీల్లో ఖర్చులు అధికం. శ్రమా«ధిక్యం. మానసిక ఆందోళన. శ్రీ నృసింహస్తోత్రాలు పఠించండి.
మకరం… (ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు)
ఎటువంటి విమర్శలు ఎదురైనా దీటుగా స్పందిస్తారు. విజయాల దిశగా అడుగులు వేస్తారు. విద్యార్థులు, నిరుద్యోగులకు ఉన్నతమైన అవకాశాలు రావచ్చు. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు. ఏ కార్యక్రమం చేపట్టినా ఎవరి సాయం లేకుండానే పూర్తి చేస్తారు. మీ మనోబలం కొన్ని సందర్భాలలో ఎంతో ఉపకరిస్తుంది. ఆస్తుల వ్యవహారాలలో చిక్కులు అధిగమిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చుకుంటూ ఖర్చులు అదుపు చేసి అత్యంత జాగ్రత్తగా మసలుకుంటారు. ఎటువంటి అవసరం వచ్చినా తట్టుకుంటారు. కుటుంబసభ్యులు మీపై ఉంచిన కొన్ని బాధ్యతలు తేలిగ్గా పూర్తి చేస్తారు. విదేశాలలో ఉన్న పిల్లల క్షేమసమాచారం ఊరట కలిగిస్తాయి. ఆరోగ్యపరమైన కొన్ని చికాకులు ఎదురైనా ఉపశమనం పొందుతారు. వృత్తులు, వ్యాపారాలను సమర్థవంతంగా నిర్వహించేందుకు తగిన ప్రణాళిక రూపొందిస్తారు. కళాకారులు, వైద్యులు, పారిశ్రామికవర్గాలకు ఒత్తిడుల నుండి విముక్తి. 11,12 తేదీల్లో వృథా ఖర్చులు. కుటుంబంలో కొన్ని సమస్యలు. ఆకస్మిక ప్రయాణాలు. విష్ణుస్తోత్రాలు పఠించండి.
కుంభం… (ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు)
ఇబ్బందులను అధిగమిస్తూ కార్యక్రమాలు పూర్తి చేస్తారు. కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుంటారు. విద్యార్థులు ప్రతిభ వెలుగులోకి వస్తుంది. సమాజంలో ప్రత్యేక గౌరవం పొందుతారు. ఆస్తి వివాదాలు పరిష్కారదశకు చేరుకుంటాయి. కొత్త కాంట్రాక్టులు కైవసం చేసుకుంటారు. శత్రువులు కూడా మీకు మద్దతుగా నిలవడం విశేషం. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. రావలసిన డబ్బు సరైన సమయంలో అందుతుంది. కొంతకాలంగా స్తబ్దుగా ఉన్న షేర్ల విక్రయాలు లాభిస్తాయి. కుటుంబసభ్యులందరినీ మెప్పించి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే, ఇంటిలో శుభకార్యాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు ప్రారంభిస్తారు. ఆరోగ్య సమస్యలు తీరి మరింత ఉపశమనం పొందుతారు. వృత్తులు, వ్యాపారాలలో కొత్త అవకాశాలు పొందుతారు. వీటిలో మీ మాటకు ఎదురులేకుండా గడిచిపోతుంది. వైద్యులు, రాజకీయవేత్తలు, కళాకారులకు ఎనలేని గౌరవం లభిస్తుంది. వీరి సేవలకు గుర్తింపు రాగలదు. 07,08 తేదీలలో దూరప్రయాణాలు. మానసిక ఆందోళన.మనశ్శాంతి లోపం. శ్రీరామస్తోత్రాలు పఠించండి.
మీనం… (పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరభాద్ర, రేవతి)
ఇబ్బందులు అధిగమించి కొంతకాలంగా నిలిచిపోయిన పనులు పూర్తి చేస్తారు. ప్రస్తుత పరిస్థితులను అనుకూలంగా మలచుకుంటూ ముందడుగు వేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని సంతోషంగా గడుపుతారు. వాహనాలు, భూముల కొనుగోలుకు సమాయత్తమవుతారు. రాబడి మునుపటి కంటే మరింత మెరుగ్గా ఉంటుంది. రావలసిన డబ్బు చాలావరకు అందుతుంది. ఖర్చులు అదుపు చేసుకుంటే మంచిది. కుటుంబ శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని సోదరులతో ఉన్న వివాదాలను పరిష్కరించుకుంటారు. ఈదిశగా రాజీ మార్గం అనుసరిస్తారు. వృత్తులు, వ్యాపారాలలో మరింత జాగ్రత్తగా వ్యవహరించి కొన్ని సమస్యల నుండి బయటపడతారు. సాంకేతిక నిపుణులు, క్రీడాకారులు, పారిశ్రామికవర్గాల కలలు ఫలిస్తాయి. 06,07 తేదీల్లో ప్రయాణాలను కుదించుకుంటారు. ఆరోగ్యంపై ప్రధానంగా దృష్టి పెట్టండి. వృథా వ్యయం. శివస్తుతి పఠించండి.