33.2 C
Hyderabad
Saturday, April 18, 2026

Live Video

spot_img

పబ్ చీప్ ట్రిక్.. కస్టమర్లకు కండోమ్‌ ఆఫర్

న్యూఇయర్ వేడుకలకు అదిరే ఆఫర్లతో కస్టమర్లును ఆకర్షింస్తున్నారు పబ్స్ యాజమాన్యం. సాధారణంగా  డిసెంబర్ 31 నైట్ కస్టమర్స్‌ను ఆకర్షించేందుకు రకరకాల ఆఫర్లు ప్రకటిస్తుంటారు. చికెన్ బిర్యానీ కొంటే డ్రింక్ ఫ్రీ.. రెండు పాస్‌లు కొనండి.. ముగ్గురు వచ్చేయండి అంటూ. కానీ పుణెలో ఓ పబ్‌ మాత్రం విచిత్రమైన ఆఫర్ ప్రకటించింది. కొంతమంది రెగ్యులర్ కస్టమర్లకు కండోమ్స్ పంపిణీ చేసింది. న్యూ ఇయర్ వేడుకల పార్టీలో పాల్గొనే వారికి.. కండోమ్స్‌తో పాటు ORSతో ఉన్న గిఫ్ట్ ప్యాక్‌ను పంపి ఇన్విటేషన్ అందించింది. న్యూ ఇయర్ పార్టీ సందర్భంగా ఈ ప్రత్యేకమైన ప్యాక్ పంపిస్తున్నామని.. తప్పకుండా పార్టీలో పాల్గొనాలంటూ సందేశమిచ్చేలా ఈ ఇన్విటేషన్ పంపింది. అయితే ఆ గిఫ్ట్ ప్యాక్ అందుకున్న ఓ వ్యక్తి…దాన్ని ఫోటో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్‌గా మారింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు.

కస్టమర్లను ఆకర్షించేందుకు చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్న పబ్‌పై సీరియస్ అయ్యారు పుణే పోలీసులు. పబ్ పార్టీని రద్దు చేయాలని నిర్ణయించారు. పబ్ నిర్వాహకులు అందించిన గిఫ్ట్ ప్యాక్ అందుకున్న వ్యక్తుల నుంచి స్టేట్‌మెంట్ రికార్డ్ చేశారు. అనంతరం పబ్ యాజమాన్యానికి నోటీసులు జారీ చేశారు. తాము పబ్ కల్చర్‌కి లేదా నైట్‌లైఫ్‌కి వ్యతిరేకం కాదని, ఈ రకమైన చీప్ పబ్లిసిటీకి మంచిది కాదని హితవు పలికారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com