28 C
Hyderabad
Tuesday, March 10, 2026

Live Video

spot_img

వచ్చే నెల 4న పీఎస్‌ఎల్‌వీ సి.59

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో వచ్చే నెల 4న ఏపీలోని తిరుపతి జిల్లా శ్రీహరికోట నుంచి పీఎస్‌ఎల్‌వీ సి.59 రాకెట్‌ ప్రయోగించనుంది. 4న సాయంత్రం 4.08 రాకెట్‌ను ప్రయోగించనున్నారు. శ్రీహరికోట షార్ లోని ప్రయోగ వేదికకు సంబంధించిన మొబైల్ సర్వీస్ టవర్ లో పీఎస్ఎల్వీ సీ59 రాకెట్ అనుసంధానం పనులు చురుకుగా జరుగుతున్నాయి.

సీ59 రాకెట్ ద్వారా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన ప్రోభా-3 అనే ఉపగ్రహంతో పాటు మరో నాలుగు చిన్నతరహా ఉపగ్రహాలను వాణిజ్యపరంగా ప్రయోగించనున్నారు. డిసెంబర్ 24న పీఎస్ఎల్వీ సీ60 మరో రాకెట్‌ను ఇస్రో ప్రయోగించనుంది. ఈ రాకెట్‌ ద్వారా రిశాట్-1బీ అనే ఉపగ్రహంతో పాటు మరో నాలుగు వాణిజ్యపరమైన ఉపగ్రహాలను ప్రయోగించబోతున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com