34.2 C
Hyderabad
Saturday, April 18, 2026

Live Video

spot_img

ఆర్థిక మంత్రికి దహీ చీనీ తినిపించిన రాష్ట్రపతి

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారమాన్‌ శనివారం బడ్జెట్‌ ప్రవేశపెట్టడానికి ముందు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతిలో దహీచీనీ తిని వెళ్లారు. భారత దేశ సాంప్రదాయాలను అనుసరించి ఏదైనా ఒక పనికి వెళ్ళే ముందు నోరు తీపి చేసుకుని వెళ్ళడాన్ని శుభసూచికంగా భావిస్తారు. నిర్మలా సీతారామన్‌ 2025-26 ఆర్థిక సంవత్సరానికి గానూ లోక్‌సభలో బడ్జెట్‌ ప్రవేశపెట్టడానికి వెళ్ళే ముందు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలసి ఆమె చేతితో దహీచీనీ ద్వారా నోరు తీపి చేసుకున్ని వెళ్ళారు. ముఖ్యమైన పని ప్రారంభించే ముందు కానీ ప్రయాణానికి వెళ్ళే ముందు కానీ చక్కరెతో కూడిన పెరుగు తిని వెళితే వెళ్ళన పని విజయవంతం అవుతుందని భారతీయులు నమ్ముతారు. పెరుగు కడుపు, మనసులకు ప్రశాంతతనిస్తుంది, అలాగే చక్కెర శీఘ్ర శక్తిని అందిస్తుంది. అదే సాంప్రదాయాన్ని మంత్రి నిర్మలా సీతారమన్‌ పాటించారు. ఇక ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యాలయం నుంచి పార్లమెంట్‌ భవనానికి బయలుదేరే సమయంలో తనతో పాటు సాంప్రదాయ లెడ్జర్‌ ఖాతా (బహి ఖతా)ను కాకుండా ట్యాబ్‌ని తీసుకువెళ్లారు. ఆర్థిక తన బడ్జెట్‌ ప్రసంగాన్ని ట్యాబ్‌ చూసి చదివారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి గానూ బడ్జెట్‌ ప్రవేశపెట్టడానికి నిర్మలా సీతారామన్‌ మధుబని కళాను గౌరవిస్తూ చీరను ధరించి వెళ్లారు. బీహార్‌ రాష్ట్రానికి చెందిన ప్రసిద్ద మధుబని కళకు, ఆ కళాకు ప్రాచుర్యం తీసుకు వచ్చిన పద్మశ్రీ దులారీ దేవి నైపుణ్యానికి గౌరవ సూచకంగా నిర్మలా సీతారామన్‌ ఆ చీరను ధరించారు. 2021లో మిథిలా ఆర్ట్స్‌ ఇన్సిస్టిట్యూట్‌ లో క్రెడిట్‌ అవుట్‌రీచ్‌ కార్యకలాపాల్లో పాల్గొనడానికి నిర్మలా సీతారామన్‌ బీహార్‌ రాష్ట్రంలోని మధుబని సందర్శించారు. ఆ సందర్భంగా దులారి దేవి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌కి ఒక చీరను బహుకరించి ఆ చీరను బడ్జెట్‌ సమర్పించినప్పుడు ధరించాలని కోరారు. శనివారం బడ్జెట్‌ సమర్పించడానికి లోక్‌సభకు వచ్చిన కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ అదే చీరను కట్టుకుని వచ్చారు. మరో విశేషం ఏమిటంటే నిర్మలా సీతారామన్‌ వరుసగా ఎనిమిదో సారి భారతదేశ వార్షిక బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రిగా రికార్డ్‌ సృష్టించారు. మొట్టమొదట సారిగా ఆమె 2019లో వార్షిక బడ్జెట్‌ ప్రవేశపెట్టాగా ఆ తరువాత వరుసగా 2020, 2021, 2022, 2023, 2024, 2025 మధ్యంతర బడ్జెట్‌తో పాటు 2025-26 వార్షిక బడ్జెట్‌ను వరుసగా ప్రవేశపెట్టిన ఘనత సాధించారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com