జైనీ క్రియేషన్స్ పతాకంపై మూలవిరాట్, పద్మ,రాజ్ కుమార్, స్వప్న నటీ నటులుగా అమ్మ నీకు వందనం, క్యాంపస్ అంపశయ్య’, ప్రణయ వీధుల్లో’, వంటి ప్రయోజనాత్మక ‘ సినిమాలు తీసిన ప్రభాకర్ జైనీ దర్శకత్వంలో శ్రీమతి విజయలక్ష్మీ జైనీ నిర్మించిన చిత్రం ‘ప్రజాకవి కాళోజీ’ బయోపిక్!.. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని డిసెంబర్ 23న విడుదలకు సిద్దమైంది.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చిత్ర దర్శకుడు ప్రభాకర్ జైనీ మాట్లాడుతూ…మన కాలపు మహాకవి కాళోజీ సందేశం విద్యార్థులకు చేరితే సినిమా తీసిన ప్రయోజనం నెరవేరుతుందనే ఉద్దేశ్యంతో తెలంగాణ ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు వేం నరేందర్ రెడ్డిని కలవడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించడం చాలా సంతోషంగా ఉంది. దీంతో ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో డిసెంబరు 23 నుండి 29 డిసెంబరు వరకు 24 థియేటర్లలో, వారం రోజుల పాటు రోజూ ఒక్క మార్నింగ్ షో మాత్రమే ఉదయం 9 నుండి 11 గంటలకు, అదీ స్కూలు పిల్లలకు ఉచితంగా ప్రదర్శిపబడుతుంది. ఇంతకంటే ఇంకా ఎక్కువగా విడుదల చేయలేనందుకు నాకూ బాధగానే ఉంది. కానీ.. ఎవ్వరు కూడా ఈ సినిమా కమర్షియల్ గా నడవదనీ, రిలీజ్ చేసే సాహసం చేయలేమని అశక్తత వ్యక్తం చేయడంతో ఈ విధంగా చేయవలసి వచ్చిందన్నారు.
నటీ నటులు కాళోజీ గారితో చిరకాలంగా సన్నిహితంగా మెదిలిన పొట్లపల్లి శ్రీనివాసరావు, నాగిళ్ళ రామశాస్త్రి, విద్యార్థి, అంపశయ్య నవీన్, డాక్టర్ వీయస్ రెడ్డి, అన్వర్, పీవీ నరసింహారావు పాత్రలో వారి సోదరుడు, పీవీ మనోహర్ రావు, ప్రముఖ కవి తుమ్మూరి రామ్మోహన్ రావు, వైభవ్ సూర్య, శంకర్, మల్లికార్జున్, ప్రియ, రాధిక, నరేశ్, రజని, దేవేందర్ రెడ్డి, లాయర్ చౌహాన్, జమీందారు పాత్రలో ఆంధ్రప్రభ చీఫ్ ఎడిటర్ వైయస్సార్ శర్మ నటించారు. మిసెస్ ఇండియా సుష్మా తోడేటి తదితరులు ఉన్నారు.