24.2 C
Hyderabad
Wednesday, July 29, 2026

Live Video

spot_img

కేజ్రీవాల్ పై విచారణకు ఓకే

  • ఈడీకి గవర్నర్ అనుమతి..
  • ఢిల్లీ ఎన్నికల నేపధ్యంలో కీలక పరిణామం

మరో రెండు నెలల్లో ఢిల్లీ ఎన్నికలు జరుతున్న సమయంలో ఆప్ అధినేత కేజ్రీవాల్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. లిక్కర్ పాలసీ స్కామ్ లో ఆయన్ను విచారించేందుకు ఈడీకి ఢిల్లీ గవర్నర్ వి.కె. సక్సేనా అనుమతినివ్వడం చర్చనీయాంశమవుతోంది. డిల్లీ ఎన్నికల్లో నాల్గొసారి అధికారం చేజిక్కించుకునేందుకు ఆప్ పకడ్బందీ ప్రయత్నాలు చేస్తోంది. ఢిల్లీ లిక్కర్ పాలసీ నిర్ణయం మనీ లాండరింగ్ అంశంతో కూడా ముడిపడి ఉన్నందున ఆదిశగా కేజ్రీవాల్ ను విచారించడానికి అనుమతి ఇవ్వాలంటూ ఈడీ గవర్నర్ కు అపీల్ చేసింది.అయితే తన పై సరైన ఆధారాలు లేవని, చార్జి షీటులో తనపై అభియోగాలు లేనందున తనపై విచారణను నిలిపేయాలని కేజ్రీవాల్ కోరారు. ఈ కేసులో జూన్ 25నుంచి సీబీఐ జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న కేజ్రీవాల్ తీహార్ జైలు నుంచి ఈ మధ్యే విడుదల అయ్యారు. సెప్టెంబర్ లో బయటకొచ్చిన కేజ్రీవాల్ అప్పటినుంచి పార్టీని ఎన్నికలకు సమాయత్తం చేస్తున్నారు. అయితే కేజ్రీవాల్ విచారణకు అనుమతి కోరుతూ ఈడీ గవర్నర్ ను తాజాగా సంప్రదించడం అందుకు అనుమతి దొరకడంతో తొందరలోనే ఆయన్ను ఈడీ విచారించనుంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com