రాజసాబ్ సినిమా షూటింగ్ లో హీరో ప్రభాస్ కి ప్రమాదం జరిగింది. హైదరాబాద్ లోని ఓ ప్రాంతంలో ఫైట్ సీన్ చిత్రీకరణ జరుగుతున్న సందర్భంగా ప్రభాస్ కాలికి తీవ్ర గాయమయ్యింది. ఈ గాయం కారణంగా ప్రభాస్ కాలి చీలమండ ఫ్రాక్చర్ అయినట్లు సమాచారం. వైద్యులు ప్రభాస్ కాలికి శస్త్రచికిత్స చేయాలని చెప్పారు. చికిత్స అనంతరం దాదాపు నాలుగు వారాలు ప్రభాస్ విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుందని వైద్యులు చెపుతున్నారు. ఇదిలా ఉండగా వచ్చే నూతన సంవత్సరం జనవరి 3వ తేదీన కల్కి సినిమా జపాన్ దేశంలో పెద్దయెత్తున రిలీజ్ కానుంది. కల్కి రిలీజ్ సమయానికి ప్రభాస్ జపాన్ వెళ్ళడానికి ప్లాన్ చేసుకున్నారు. అయితే సోమవారం జరిగిన ప్రమాదం కారణంగా ప్రభాస్ జపాన్ పర్యటన రద్దయ్యింది.