ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మెప్పు కోసం కొందరు పోలీసులు పనిచేస్తున్నారని మాజీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. సత్యసాయి జిల్లా పాపిరెడ్డిపల్లిలో ఫ్యాక్షన్ రాజకీయాలకు హత్యకు గురైన కురుబ లింగమయ్య కుటుంబాన్ని మంగళవారం వైఎస్.జగన్ పరామర్శించారు. టోపీలపై ఉన్న మూడు సింహాలకు సెల్యూట్ చెయ్యకుండా చంద్రబాబుకు సెల్యూట్ చేసి ఆయన చెప్పినట్లు విచక్షణా రహితంగా పని చేస్తున్న పోలీసులకు చెపుతున్నా అంటూతీవ్ర స్ధాయిలో హెచ్చరించారు. ఎల్లాకాలం చంద్రబాబు పరిపాలన ఉండదని, తప్పు చేసిన వారిని ఎవరినీ వదిలిపెట్టమని వైఎస్.జగన్ చెప్పారు. తప్పు చేసిన వారు శిక్ష అనుభవిస్తారు… యూనీఫామ్ తీయించి చట్టం ముందు నిలబెడతామని జగన్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో పోలీసులు, టీడీపీ నాయకులు కలసి చేస్తున్న నేరాలు బహిరంగంగా కనిపిస్తున్నాయనడానిఇక లింగమయ్య హత్యే ఉదాహరణ అన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై కుట్రపూరితంగా కేసులు పెట్టి వేధించారని, పోసాని కృష్ణమురళిపై 18 కేసులు అక్రమంగా బనాయించి అనారోగ్యాన్ని కూడా పట్టించుకోకుండా తీవ్రంగా వేధించారన్నారు. అలాగే నందిగం సురేష్ పై కూడా తప్పుడు కేసులు పెట్టి 145 రోజులు జైల్లో పెట్టారని వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు చంద్రబాబు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు గురించి అడుగుతున్నారని అవి పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని వైఎస్.జగన్ విమర్శించారు.
- Advertisement with us -