28 C
Hyderabad
Tuesday, March 10, 2026

Live Video

spot_img

అల్లు అర్జున్ పై కేసు నమోదు

పుష్ప-2 ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాద్ నగరంలోని సంధ్యా ధియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై చిక్కడపల్లి పోలీసులు కేసులు నమోదు చేశారు. పుష్ప 2 సినిమా హీరో అల్లు అర్జున్ తో పాటు సంధ్య ధియేటర్ యామాన్యం, అల్లు అర్జున్ భధ్రతా సిబ్బందిపై కేసు నమోదు చేశారు. తెలంగాణ కాంగ్రెస్ లీగల్ సెల్ వైస్ చైర్మన్ తిరుపతి వర్మ ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రీమియర్ షో సందర్భంగా సంధ్యా ధియేటర్ లో తొక్కిసలాట జరిగి ఓ మహిళ మరణించిన ఘటనలో అల్లు అర్జున్ టీమ్ పై చర్యలు తీసుకోవాలని తిరుపతి వర్మ చిక్కడపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి హీరో అల్లు అర్జున్, సంధ్య థియేటర్ యజమాన్యం, అల్లు అర్జున్ సెక్యూరిటి వింగ్ పై 105, 118(1)r/w3(5) బీఎన్ఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్లు సెంట్రల్ జోన్ డీసీపీ ఆకాంక్ష్ యాదవ్ తెలిపారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com