విమానంలో 72 మంది…
కజకిస్తాన్లో విమానం కుప్పకూలింది. 72 మంది ప్రయాణికులతో కూడిన విమానం బాకు నుంచి రష్యాకు వెళుతున్న అజర్ బైజాన్ ఎయిర్ లైన్స్ కు చెందినది. కజకిస్తాన్ లోని అక్టౌ విమానాశ్రయం దగ్గర ఇది కూలిపోయింది. పొగమంచు కారణంగానే ప్రమాదం జరిగి ఉండొచ్చని అనుకుంటున్నారు. కుప్పకూలిన విమానం నుంచి దట్టమైన మంటలు రేగడంతో మ్రుతుల సంఖ్యపై అనుమానాలు నెలకొన్నాయి. కాబిన్ క్రూతో సహా అన్నీ దగ్ధమైపోయినట్లు తెలుస్తోంది. విమానం కుప్పకూలడానికి ముందు అనేక సార్లు పైలట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ కోసం విన్నవించినట్లు.. అయితే గ్రౌండ్ లో దట్టమైన పొగమంచు కారణంగా ల్యాండింగ్ సాధ్యం కాలేదని సమాచారం.