అమెరికాలాంటి అగ్రరాజ్యంలో ఏదైనా ప్రమాదం జరిగితే దానికి సంబంధించిన వివరాలు క్షణాల్లో బయటికి వస్తాయి. కానీ అమెరికాలో జరిగిన ఓ విమాన ప్రమాదానికి సంబంధించిన వివరాలు మాత్రం గంటలు గడుస్తున్నా బయటికి రావడం లేదు. ఆ విమానంలో ఎంత మంది ఉన్నారు? వారు ఎవరు? బతికున్నారా? లేదా? అనేది మాత్రం మిస్టరీగా మారింది.
మిన్నెసోటా స్టేట్‌లోని మిన్నెయాపోలిస్ ఏరియాలో ఓ చిన్న విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో భారీగా మంటలు చెలరేగడంతో పక్కనే ఉన్న ఓ ఇల్లు అగ్నికి ఆహుతైపోయింది. కానీ ఇంత వరకు దీనికి సంబంధించిన వివరాలు మాత్రం బయటికి రాలేదు.
సింగిల్ ఇంజిన్ గల TBM-7 విమానం బ్రూక్లిన్ ఏరియాలో కూలిపోవడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ప్రమాదానికి గల కారణాలపై ఇప్పటికే దర్యాప్తు ప్రారంభమైంది. గంటలపాటు శ్రమించి మంటలను కూడా అదుపులోకి తీసుకొచ్చారు. కానీ మృతుల విషయంలో మాత్రం ఎలాంటి క్లారిటీ ఇవ్వడం లేదు. అయితే ఇంట్లోని వారు మాత్రం ఈ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.
అయితే ఈ ప్రమాదంలో ఒకరు మరణించినట్టు తెలుస్తోంది. అయితే విమానంలో ఎంత మంది ఉన్నారనే విషయంపై అధికారులు స్పందించడం లేదు. అందులో ఎవరున్నారు? వారి వివరాలేంటి? అనేది మాత్రం మిస్టరీగా మారింది. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. విమానం కూలడం.. ఆ తర్వాత భారీగా మంటలు చెలరేగడాన్ని చుట్టుపక్కల ఉన్న కెమెరాల్లో రికార్డైంది.