వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శ్రీ కృస్ణ దేవ రాయలు మాదిరిగా చరిత్రలో నిలిచిపోయే మహోన్నత వ్యక్తి అని వేద పండితులు ప్రవచించారు. శ్రీ విశ్వావసు నామ ఉగాది పర్వదినం సందర్భంగా తాడేపల్లిలోని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో పంచాంగ శ్రవణం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా వేద పండితులు, ప్రముఖ అవధాని నోరి నారాయణ మూర్తి పంచాంగ శ్రవణం చేశారు.
వైఎస్ జగన్.. శ్రీ కృష్ణ దేవరాయలు మాదిరిగానే సాంఘికంగా ఔన్నత్యాన్ని పొందుతారని పంచాంగ శ్రవణంలో పేర్కొన్నారు. వైఎస్ జగన్ మళ్లీ విజయ దుందుభి మోగిస్తారని చెప్పారు. ఓటమి పాలైతే చాలా మంది భయపడతారని, కానీ, జగన్ మాత్రం మిగతా వాళ్ల లాగా భయపడ లేదని చెప్పారు. మిథున రాశి వారికి ఈ యేడాది అంతా మంచే జరుగుతుందన్నారు. మిథున రాశిలో జన్మించిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మళ్లీ మంచి రోజులు వస్తున్నాయన్నారు.
ఆవేశంలో ప్రజలు చేసిన తప్పుకు ఇప్పుడు మూల్యం చెల్లించుకుంటున్నారని పంచాంగ శ్రవణం లో ప్రవచించారు. ఇక, ఆరుద్ర నక్షత్రంలో పుట్టిన జగన్‌కు కుటుంబ సమస్యలు ఉన్నాయని, అయితే, ఆ సమస్యన్నీ ఈ యేడాది సమసి పోతాయన్నారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మళ్లీ సీఎం కుర్చీలో కూర్చుంటారని చెప్పారు.