ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో డిప్యూటీ సీయం పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. సోమవారం వెలగపూడిలోని సచివాలయానికి వచ్చిన డిప్యూటీ సీయం చంద్రబాబుతో సమావేశం అయ్యారు. వీరిద్దరి మధ్య తాజా రాజకీయ పరిణమాలు చర్చకు వచ్చినట్లు సమాచారం. అలాగే పవన్ కళ్యాణ్ అన్న కొణిదెల నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకుంటామని చంద్రబాబు ప్రకటించిన నేపథ్యంలో వీరి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. భేటీ సందర్భంగా నాగబాబుకు ఏ శాఖ కేటాయించాలన్న అంశంతో పాటు, ప్రమాణస్వీకార తేదీపై చర్చించినట్లు తెలిసింది. మిగిలి ఉన్న నామినేటెడ్ పదవుల భర్తీ విషయం కూడా చర్చకు వచ్చినట్లు సమాచారం