ఏళ్లు గడుస్తున్నా పాకిస్థాన్ తీరు మారడం లేదు. భారత్‌ను కవ్వించం.. ఆ తర్వాత చావు దెబ్బ తినడం ఇప్పుడు పాక్‌కు కామన్‌గా మారింది. ఇంతకుముందు వివాదస్పద ప్రాంతాల్లో చొరబాట్లకు ప్రయత్నించేవారు పాక్ ఉగ్రవాదులు. అయితే ఇప్పుడు నేరుగా పాక్ ఆర్మీ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ కాల్పులు జరుపుతున్నారు.
జమ్ముకశ్మీర్‌లోని పూంచ్ సెక్టార్లో పాకిస్థాన్ వైపు నుంచి కాల్పులు జరిపాయి. వెంటనే అప్రమత్తమై రంగంలోకి దిగిన ఇండియన్ ఆర్మీ.. గట్టిగా సమాధానం ఇచ్చింది. దీంతో పాక్‌కు భారీ నష్టం జరిగినట్టు తెలుస్తోంది. పాక్ వైపు నుంచి 10 నుంచి 15 రౌండ్ల కాల్పులు జరిగినట్టు తెలుస్తోంది.
ఇప్పటికే కృష్ణ ఘాటి సెక్టార్లో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది పాక్ ఆర్మీ. ఫార్వర్డ్ పోస్ట్‌పై కాల్పులు జరిపింది. దీంతో అప్పుడు కూడా గట్టిగానే సమాధానం ఇచ్చింది ఇండియన్ ఆర్మీ. ఈ కాల్పుల్లో పాక్‌కు చెందిన ముగ్గురు కమాండోలు, నలుగురు ఉగ్రవాదులు మరణించినట్టు ఇండియన్ ఆర్మీ గుర్తించింది. కానీ దీనిని అధికారికంగా ధ్రువీకరించలేదు. ఈ ఘటన మరిచిపోకముందే మళ్లీ కాల్పులు జరిపింది పాక్.
ఇక అకునూర్ సెక్టార్లో ఐఈడీ పేలుడు కారణంగా ఇద్దరు జవాన్లు మృతి చెందగా.. ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. ఇలా LOCలో వరుసగా అలజడులు సృష్టిస్తోంది పాక్ ఆర్మీ. అయితే దీని వెనక ఏదైనా కుట్ర ఉందా? అందుకే ఇలా కవ్వింపులకు పాల్పడుతున్నారా? అనే దానిపై ఫోకస్ చేసింది ఇండియన్ ఆర్మీ. అదే సమయంలో పెట్రోలింగ్‌ను మరింత పెంచింది.