బుధవారం వేకువ జామున పాకిస్తాన్‌లో ఉన్న ఉగ్ర స్ధావరాలపై భారత వైమానిక దళం చేసిన ఆకస్మిక దాడులకు ప్రతీకారంగా భారత దేశంపై పాకిస్తాన్ మిలటరీ తలపెట్టిన దాడి ప్రయత్నాలను భారత్ సమర్ధవంతంగా తిప్పికొట్టింది. పాక్ వైమానిక రక్షణ వ్యవస్ధలపై భారత సైన్యం విరుచుపడింది. భారత్ భూభాగం మీదకు ప్రయోగించాలని చూసిన పాక్ మిస్సైళ్ళను భారత్ రక్షణ దళాలు సమర్ధవంతంగా కూల్చివేశాయి. యాంటీ మిస్సైల్ సిస్టం ద్వారా పాక్ పన్నాగాలను ముందుగానే పసిగట్టిన భారత్ గాల్లోనే ఆ మిస్సై్ళ్ళను పేల్చి వేశాయి. భారత్, పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉన్న దాదాపు 15 నగరాలపై గురువారం దాడులు చెయ్యడానికి పాకిస్తాన్ వైమానిక దళాలు సిద్దం అయ్యాయి. భారత్ నగరాలపై మిస్సైళ్ళను ఎక్కుపెట్టి దాడులు చెయ్యడానికి టైమింగ్ సెట్ చేసుకున్నాయి. అయితే ఈలోపే భారత రక్షణ వ్యవస్ధ మిసైళ్ళ సిగ్నల్స్‌ను యాంటీ మిస్సైల్ సిష్టమ్ ద్వారా గుర్తించి వాటిని గాలిలోనే తుత్తునీయులని చేసింది. భారత్ భద్రతా దళాలు ఎస్-400 మిస్సైళ్ళను ఉపయోగించి పాకిస్తాన్ కి బుద్ది చెప్పాయి. గడచిన రెండు రోజులుగా భారత్ సైకిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని 5 అడుగల పైన ఉండే ద్రోణ్లతో పాకిస్తాన్ దాడులకు ప్రయత్నిస్తోంది. వీటిని భారత భద్రతా వ్యవస్ధలు సమర్ధవంతంగా అడ్డుకుంటున్నాయి. ఈ క్రమంలో బుధవారం భారత వైమానిక దళాలు 21 ఉగ్రస్ధావరాలను తుదముట్టించాయి. దీంతో ఆక్రోశానికి గురైన పాకిస్తాన్ గురువారం భారత్ లోని పలు నగరాలపై వైమానిక దాడులు చెయ్యడానికి ప్లాన్ చేసింది. ఈ విషయాన్ని పసిగట్టిన భారత్ ఏకంగా లాహోర్ ఎయిర్ బేస్ మీదే బాంబుల వర్షం కురిపించింది. దీంతో లాహోర్ ఎయిర్ పోర్ట్ పూర్తిగా ధ్వంసమయ్యింది. రన్ వే కూడా దెబ్బతిన్నట్లు సమాచారం. అయితే బుధవారం పాక్ ఆక్రమిత కాశ్మీర్, పాకిస్తాన్ పరిధిలో జరిగిన వైమానిక దాడులు మేమే చేశామని భారత్ మిలట్రీ అధికారులు ప్రకటించారు. కానీ గురువారం లాహోర్ నగరంపై జరుగుతున్న ఎడతెరిపిలేని మిస్సైల్ దాడులు ఎవరు చేస్తున్నారన్న విషయం మధ్యాహ్నం వరకూ ప్రపంచానికి తెలియలేదు. మధ్యాహ్నం రక్షణ మంత్రి రాజనాథ్ సింగ నేతృత్వంలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఆయన ఈవిషయాన్ని ప్రకటించారు. పాకిస్తాన్ మన నగరాలపై దాడులకు ప్రయత్నించిందని దాన్ని తిప్పి కొట్టే క్రమంలో లాహోర్ ఎయిర్ బేస్ పై దాడులు చేయాల్సి వచ్చిందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అఖిలపక్ష సమావేశంలో వెల్లడించారు.