36.2 C
Hyderabad
Saturday, May 30, 2026

Live Video

spot_img

వచ్చేనెల 6 నుంచి ఒంటిమిట్ట కోదండ రాముడి మహా సంప్రోక్షణ

వైఎస్‌ఆర్‌ కడప జిల్లాలోని ప్రఖ్యాత ఒంటిమిట్ట శ్రీ కోదండ‌రామ‌స్వామివారి ఆల‌యంలో మార్చి 6వ తేదీ నుంచి 9వ తేదీ వరకు మహా సంప్రోక్ష‌ణ, కుంభాభిషేకం జరగనున్నాయి. ఈ వేడుకల కోసం ఆలయంలో మార్చి 5వ తేదీ సాయంత్రం విష్వక్సేనారాధన, పుణ్యహవచనం, వాస్తు హోమం, అంకురార్పణ జరుగనున్నాయి. మార్చి 6వ తేదీ ఉదయం 7.30 గంట‌ల‌కు భ‌గ‌వ‌త్పుణ్యాహ‌ము, అగ్ని మ‌ధ‌న‌ము, యాగశాలలో వైధిక కార్యక్రమాలు, మహా కుంభ, ఉపకుంభ, చక్రబ్జా మండల, పరివారకుంభారాధనలు, ప్రధాన మూర్తి హోమములు, శ్రీ మద్రామాయణ హ‌వన ప్రారంభం, మన్మోహన శాంతి హోమం, పూర్ణాహుతి అర్చన నిర్వహిస్తారు. తొలిరోజు సాయంత్రం 5.30 గంటలకు చతుస్థానార్చనము, స‌హ‌స్ర‌ కలశాదివాసం, వేదాది పారాయణం, మూర్తి హోమం, పరివార హోమములు, పూర్ణాహుతి శాత్తుమొర భక్తి శ్రద్ధలతో నిర్వహించనున్నారు.

రెండో రోజైన మార్చి 7వ తేదీ శుక్రవారం ఉద‌యం 8 గంట‌ల‌కు సహస్ర కలశావాహన, రామ తారక హోమం, శ్రీమద్రామాయణ హోమం, పవమాన పంచసూక్త హోమములు, విమాన గోపురం ఛాయా స్న‌పనము, పరివార హోమ‌ములు, పూర్ణాహుతి నిర్వ‌హిస్తారు. శుక్రవారం సాయంత్రం 5.30 గంటలకు సామూహిక విష్ణు సహస్రనామ పారాయణం, చతు:స్థానార్చ‌న‌ము, మూర్తి హోమం జ‌రుగ‌నుంది.

మూడో రోజు మార్చి 8వ తేదీ‌ శనివారం ఉద‌యం 6 గంట‌ల‌కు చతు:స్థానార్చ‌న‌ము, శ్రీమద్రామాయణ యజ్ఞం, మూర్తి హోమం, స‌హ‌స్ర‌క‌ల‌శాది దేవత హోమం, స‌హ‌స్ర క‌ల‌శాభిషేకం, పూర్ణాహుతి జరుగునుంది. అదే రోజు సాయంత్రం 6 గంటలకు కళాపకర్షణ, శ‌య్యాదివాసం, ప్రధాన మూర్తి హోమం, తత్వ‌న్యాస హోమములు, వేదాది పారాయణం, అష్టబంధన సమర్పణ, శాంతి హోమం, పూర్ణాహుతి, మహా శాంతి అభిషేకం నిర్వహించనున్నారు.

ఇక, ఉత్సవాల్లో చివరి రోజు మార్చి 9వ తేదీ శనివారం భగవత్పుణ్యాహం, మూర్తి హోమం, శ్రీమద్రామాయణ హోమం, పంచసూక్త – ప‌వమాన హోమములు నిర్వ‌హిస్తారు. అనంత‌రం ఉదయం 9:30 గంటలకు మహా పూర్ణాహుతి, ఉదయం 10.15 గంటల నుంచి 11:30 గంటల వరకు వృషభ లగ్నంలో మహా సంప్రోక్ష‌ణ, మహా కుంభాభిషేకము, స్వర్ణ పుష్పార్చన శాస్త్రోక్తంగా నిర్వ‌హించ‌నున్నారు. అనంత‌రం భ‌క్తుల‌ను స్వామివారి ద‌ర్శ‌నానికి అనుమ‌తిస్తారు.

ఒంటిమిట్ట శ్రీ కోదండ‌రామ‌స్వామివారి ఆల‌యంలో గ‌త ఏడాది సెప్టెంబర్ 6 నుండి 8వ తేదీ వ‌ర‌కు బాలాల‌యం నిర్వ‌హించారు. సాధారణంగా గర్భాలయంలో జీర్ణోద్ధరణ కోసం బాలాలయం చేపడతారు. ఇందుకోసం ఆలయంలోని మండపంలో నమూనా ఆలయం ఏర్పాటుచేసి గర్భాలయంలోని మూలవర్ల చిత్ర‌ప‌టాల‌ను ఏర్పాటు చేశారు.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com