- మోడీని ఆకాశానికెత్తేసిన ట్రంప్
- సూటిగా, సుత్తి లేకుండా మాట్లాడతారు
- నిర్మోహమాటంగా చర్చలు జరుపుతారు
- మేం ఇన్నాళ్లూ ఓపికతో ఉన్నాం…
- ఇక అది కుదరదని తేలిపోయింది
- పన్నులు, సుంకాలు మీరెంత వేస్తే మేం అంత…
- తగ్గేదే లే.. అంటూ తేల్చేసిన ట్రంప్
అమ్మో.. ఆయన సంప్రదింపుల విషయంలో చాలా కఠినం.. అదే టైమ్ లో నిర్మొహమాటంగా, బాగా చర్చించగలరు.. ఆ విషయంలో ఆయనకు నేను పోటీయే కాదు అంటూ చమత్కరించారు అధ్యక్షుడు ట్రంప్. అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని మోడీకి ఆదరణ పూర్వక స్వాగతం పలికిన ట్రంప్ గంట పాటు కీలక అంశాలపై మనసు విప్పి మాట్లాడారు. ద్వై పాక్షిక సహకారంతో సహా కీలక ఒప్పందాలపైనా చర్చలు జరిగాయి. దాదాపు గంట పాటు జరిగిన ఈ భేటీ తర్వాత ఇద్దరూ కలసి సంయుక్తగా మీడియా ముందుకొచ్చారు. విలేకరులు అడిగిన అనేక ప్రశ్నలకు జవాబులిచ్చారు.
టారిఫ్ లు, పన్నులలో తగ్గేదే ల్యా…
ఏదైనా ఇచ్చి పుచ్చుకోడమే.. పన్నులు, సుంకాలు కూడా అలాగే ఉంటాయి. అమెరికా తమ ఉత్పత్తులపై టారిఫ్ తగ్గిస్తూ ఉంటే ఎవరూ పట్టించుకోవడం లేదు. అందుకే మేం కూడా అలాగే స్పందిస్తాం.. మీరు వడ్డిస్తే.. మేమూ వడ్డిస్తాం.. తగ్గేదే లేదని తేల్చి చెప్పాసారు. మేక్ అమెరికా గ్రేట్ కల ఫలించాలంటే కఠినంగానే ఉండాలి. అన్నారు ట్రంప్.అమెరికా ఎకానమీని పెంచాలంటే అదొక్కటే మార్గం అని కూడా ట్రంప్ కామెంట్ చేశారు.ఇప్పటికీ ప్రపంచంలో అతిపెద్ద ఎకానమీ కలిగున్న దేశం అమెరికా.. కోవిడ్ టైమ్ లో ఆర్థికంగా చాలా నష్టాలు చవిచూశాం. కానీ ఈ కష్టం నుంచి కచ్చితంగా గట్టెక్కుతాం అన్నారు ట్రంప్..
చూస్తూ ఉండండి.. ఏమేం డీల్స్ చేసుకుంటామో..
భేటీకి ముందు మీడియాతో మాట్లాడుతూ మోడీని ట్రంప్ గొప్ప నేత అని పొగిడారు. రెండు దేశాలు అద్భుతమైన వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోబోతున్నాయి అంటూ హింట్ ఇచ్చారు.
అమెరికాను సందర్శించిన తొట్ట తొలి గ్లోబల్ నేత కూడా మోడీయే..ఇద్దరూ ఎన్నికల్లో గెలిచాక జరుగుతున్న తొలి భేటీ ఇది.. మోడీ ప్రధాని హోదాలో అమెరికాలో జరుపుతున్న 10వ సందర్శన కాగా ట్రంప్, ట్రంప్ తో ఇది నాలుగవ భేటీ..