ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తొలి దళిత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య 104వ జయంతి సందర్భంగా జూబ్లీహిల్స్ నివాసంలో ఆ మహనీయుడి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రిగా దామోదరం సంజీవయ్య దళిత, మహుజనుల కోసం పాటుపడ్డారని రేవంత్ రెడ్డి ఆయన సేవలను కొనియాడారు.
కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా ఉండి దేశంలో తొలి ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన మహనీయుడు దామోదరం సంజీవయ్య అని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. పెన్షన్ల పథకానికి అద్యుడు .. దళిత జాతి ఆత్మగౌరవానికి ప్రతీక దామోదరం సంజీవయ్య అని సీఎం పేర్కొన్నారు.
సంజీవయ్య చిత్రపటానికి సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, కార్పొరేషన్ చైర్మన్ లు పటేల్ రమేష్ రెడ్డి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మానాల మోహన్ రెడ్డి, ఎమ్మెల్యేలు రాజేందర్ రెడ్డి, కుంభం అనిల్ కుమార్ రెడ్డి, ఎడ్యుకేషన్ కమిషన్ సభ్యులు చారగొండ వెంకటేశ్, మాజీ ఎమ్మెల్యె సంపత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.