అఫ్ఘానిస్థాన్, ఇంగ్లండ్ మధ్య జరిగిన ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లో కేవలం గెలుపునే కాదు.. అనేక రికార్డులను కూడా సొంతం చేసుకున్నారు అఫ్ఘాన్ ప్లేయర్లు. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ దిగ్గజాల నుంచి ప్రశంసలు అందుకుంటున్నారు.
ఇబ్రహీం జద్రాన్ ఈ మ్యాచ్‌లో చేసిన స్కోర్ 177. ఇప్పటి వరకు బెన్ డకెట్ చేసిన 165 పరుగులు ఛాంపియన్స్ ట్రోఫీలో హైఎస్ట్ స్కోర్. కానీ దానిని బీట్ చేశాడు జద్రాన్. వన్డేల్లో అత్యధిక స్కోరు సాధించిన అఫ్ఘాన్ బ్యాటర్‌గా నిలిచాడు జద్రాన్. అంతేగాక ఐసీసీ టోర్నమెంట్లో ఓ ఇన్నింగ్స్‌లో 150పై స్కోరు చేసిన చిన్న వయస్కుడిగా కూడా 23 ఏళ్ల జద్రాన్ నిలిచాడు. ఓ ఐసీసీ టోర్నమెంట్లో ఇంగ్లండ్‌పై అత్యధిక వ్యక్తిగత స్కోరు కూడా ఇదే. వన్డేల్లో జద్రాన్‌కు ఇది ఆరో సెంచరీ. ఇవేకాదు ఐసీసీ టోర్నమెంట్ మ్యాచ్‌లో అఫ్ఘానిస్థాన్ టీమ్ చేసిన అత్యధిక స్కోర్ కూడా ఇదే.
ఇక అఫ్ఘాన్ టీమ్ సెన్సెషనల్ విక్టరీపై మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ప్రశంసలతో ముంచెత్తాడు. ఇది వారికి అనుకోకుండా దక్కిన విజయం కాదని.. వారు దానిని అలవాటు చేసుకున్నారంటూ ప్రశంసలు కురిపించాడు. ఇక జద్రాన్‌పై ప్రత్యేకంగా ప్రశంసలు కురిపించాడు. ఇక అజ్మతుల్లా బౌలింగ్‌ను కూడా మెచ్చుకున్నాడు.