31.2 C
Hyderabad
Tuesday, September 15, 2026

Live Video

spot_img

పాక్ విమానాలకు భారత్ గగనతలంలో నో ఎంట్రీ

భారత గగనతలంలో పాకిస్తాన్‌ దేశానికి సంబంధించిన విమానాల రాకపోకలను కేంద్ర ప్రభుత్వం నిలిపివేసింది. ఈ మేరకు భారతదేశం ఈ రోజు  NOTAM (నోటీస్‌ టు ఎయిర్ మెన్‌ మిషన్‌) జారీ చేసింది. ఈ తాజా నోటమ్‌ ప్రకారం పాకిస్తాన్‌ దేశంలో నమోదైన విమానాలు, ఎయిర్‌ లైన్స్‌, సైనిక విమానాల రాకపోకలకు ఈ నెల 23వ తేదీ వరకూ భారత గగనతలం మూసివేయడం జరిగింది. 1999లో జరిగిన కార్గిల్‌ యుద్దం, 2019 బాలాకోట్‌ సర్జికల్‌ దాడుల సమయాల్లో కూడా భారత్‌ ఈవిధంగానే గగనతలంలో పాక్‌ విమానాలకు నిషేధాజ్ఞలు జారీ చేసింది. భారత్‌ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల పాకిస్తాన్‌ నుంచి ఆగ్నేయాసియాకు వెళ్ళే విమాన సర్వీసులపై ప్రభావం పడుతుంది. భారత్‌ గగన తలంలో నిషేధాజ్ఞలు ఉండటంతో పాకిస్తాన్‌ నుంచి ఆగ్నేయాసియాకు వెళ్ళే విమానాలను చైనా మీదుగా మళ్లించాల్సి ఉంటుంది. ఇస్లామాబాద్‌ నుంచి కౌలాలంపూర్‌ కు వెళ్ళే విమానం భారత గగనతలం నుంచి కాకుండా ఇతర దేశాల గగనతలం నుంచి వెళ్ళడం వల్ల ప్రయాన సమయంతో పాటు ఇతర ఆపరేషల్ ఖర్చులు కడా భారీగా పెరుగుతాయి. గత ఏప్రిల్‌ నెల 25వ తేదీన పాకిస్తాన్‌ గగనతలాన్ని భారత దేశానికి చెందిన విమానయాన సంస్ధలకు మూసివేయండంతో చర్యకు ప్రతి చర్యగా భారత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుది. ఓవర్‌ ఫ్లైట్‌ ఫీజుల ద్వారా పాకిస్తాన్‌ కు వచ్చే ఆదాయంలో మిలియన్ల రూపాలయ నష్టం భారత్‌ తాజా నిర్ణయం వల్ల జరగవచ్చు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com