- తొలి సెంచరీతో పరువు
- నిలబెట్టిన తెలుగు కుర్రాడు
- వాషింగ్ టన్ సుందర్ తో కలిసి 127 పరుగుల భాగస్వామ్యం
బాక్సింగ్ టెస్ట్ నిజంగానే బాక్సింగ్ బరిని తలపెడుతోంది. మెలబోర్న్ లో ఆస్ట్రేలియాలో జరుగుతున్న నాలుగో టెస్ట్ అద్భుతమైన టర్న్ తీసుకుంది. వన్ సైడ్ అయిపొయింది అనుకున్న మ్యాచ్ ని… తెలుగు క్రికెటర్ దుమ్ము దులిపాడు. చరిత్రలో నిలిచిపోయే మ్యాచ్ ఆడాడు. టీం ఇండియాకి చావో రేవో అన్నట్టుగా సాగే మ్యాచ్ లో మహమహులు అందరూ చేతులెత్తెశారు. దీంతో నితీశ్ కుమార్ జట్టుకి వెన్నుముకలా నిలిచాడు. వాషింగ్ టన్ సుందర్ తో కలిసి 7 వ వికెట్ కి 127 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. ఈ నేపథ్యంలో సుందర్ 50 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఈ తరుణంలో బుమ్రా వెంటనే అవుట్ అవడంతో… సిరాజ్ ఆఖరి వికెట్ గా 4 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. ప్రస్తుతం క్రీజ్ లో నితీశ్ 105 పరుగులతో నాటౌట్ గా ఉన్నాడు. మూడో రోజు మూడో సెషన్ ముగిసే సమయానికి టీమ్ ఇండియా 9 వికెట్ల నష్టానికి 358 పరుగులు చేసింది. వర్షం వచ్చి అప్పుడప్పుడు అంతరాయం కలిగించడంతో ఆట ఆగి ఆగి మళ్ళీ ముందుకు సాగింది.
మూడో రోజు 5 వికెట్ల నష్టానికి 164 పరుగులతో భారత్ ఆట ప్రారంభించింది. పంత్ (28), జడేజా (17) చేసి అవుట్ అయ్యారు. అల్ రౌండర్ గా పేరు పొందిన ఆకాశ్ దీప్ డక్ అవుట్ అయ్యాడు. అప్పటి నుంచి ఆంధ్రా కుర్రాడు నితీశ్ (105 నాటౌట్ ) ఆదుకున్నాడు. టీమ్ ఇండియాను ఫాలో ఆన్ నుంచి తప్పించాడు.
ప్రస్తుతం టీమ్ ఇండియా 116 పరుగులు వెనుకపడి ఉంది. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో 474 పరుగులు చేసింది. వర్షం రావడమా? లేక సెకండ్ ఇన్నింగ్స్ లో సీనియర్స్ ఇరగదేయాడమో చేయాలి. అప్పుడే టీమ్ ఇండియా బతికిబట్ట కడుతుంది.