25 ఏళ్ల తర్వాత మళ్లీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్‌లో న్యూజిలాండ్, భారత్ తలపడబోతున్నాయి. చివరిగా 2000 సంవత్సరంలో ఈ రెండు టీమ్స్ మధ్య పోటీ జరగగా.. అప్పుడు కివీస్ విజయం దక్కించుకుంది. సౌరభ్ గంగూలీ కెప్టెన్‌గా ఉన్నప్పుడు బరిలోకి దిగిన ఇండియా టీమ్ కివీస్ చేతిలో ఓడింది. ఆ తర్వాత 2021లో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్స్‌లో కూడా టీమిండియాను ఓడించి కప్పును ఎగరేసుకుపోయింది న్యూజిలాండ్.
నిజానికి 2000లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్‌లో టీమిండియా ఆరు వికెట్లు నష్టపోయి 264 పరుగులు చేసింది. ఇందులో గంగూలీ 117, సచిన్ 69 పరుగులు చేశారు. ఆ తర్వాత ఛేజింగ్‌కు దిగిన న్యూజిలాండ్ బ్యాటర్లలో క్రిస్ సెంచరీ చేయడంతో కివీస్ ఈజీగా గెలిచేసింది.
ఈ ఈవెంట్ తర్వాత వైట్ బాల్ గేమ్స్‌లో మళ్లీ న్యూజిలాండ్ ఎప్పుడూ గెలవలేదు. 2015, 2019 వరల్డ్ కప్స్ సమయంలో దగ్గరి వరకు వచ్చినా ఫైనల్స్ లో తడబడింది న్యూజిలాండ్. అందుకే ఈ కప్‌ను ఎలాగైనా గెలవాలన్న కసి కనిపిస్తోంది కివీస్ ప్లేయర్స్‌లో.
ఇక టీమిండియాను చూస్తే ఈ ట్రోఫీలో ఇప్పటి వరకు అన్‌బీటబుల్‌గా ఉంది. వరుసగా నాలుగు మ్యాచ్‌లు గెలిచింది. మరో మ్యాచ్ గెలిస్తే కప్పు మనదే. అందుకే ఇప్పటి నుంచి వ్యూహాలను సిద్ధం చేసుకుంటుంది. దుబాయ్ పిచ్‌లు భారత్‌కు అనుకూలమే అయినా.. ఆ పిచ్ ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతుందో తెలియని పరిస్థితి. టీమిండియా లాస్ట్ రెండు మ్యాచ్‌లో నలుగురు స్పిన్నర్లతో బరిలోకి దిగింది. ఫైనల్స్‌కు కూడా అదే సీన్ రీపిట్ చేసే అవకాశం ఉంది.
ఇక పేసర్లు మరోసారి రాణించాల్సి ఉంటుంది. ఎర్లీ ఓవర్స్‌లో వికెట్లు తీస్తే ఒత్తిడి పడకుండా ఉంటుంది. ఇరు టీమ్స్‌లో స్పిన్నర్లు మంచి ఫామ్‌లోనే ఉన్నారు. శాంట్నర్ ఇప్పటికే మ్యాచ్‌లను శాసిస్తున్నాడు. ఇక బ్రాస్‌వెల్, ఫిలిప్స్, రచిన్ కూడా మెరుగ్గానే బౌలింగ్ చేస్తున్నారు. ఇక ఫిల్డింగ్ విషయంలోనూ రెండు టీమ్స్ మెరుగ్గానే కనిపిస్తున్నాయి. ఇక టాస్ కూడ కీలకంగానే ఉండనుంది. ఇప్పటి వరకు ఈ ట్రోఫీలో ఒక్క టాస్ కూడా గెలవలేదు టీమిండియా. అయినా ఫలితం మాత్రం మనకు అనుకూలంగానే ఉంటుంది. మరి ఫైనల్స్‌లో ఏం జరుగుతుందో చూడాలి.