25.1 C
Hyderabad
Saturday, October 31, 2026

Live Video

spot_img

నయా హనీ ట్రాప్‌ – వణికిపోతున్న ప్రజా ప్రతినిధులు

హనీ ట్రాప్‌. సాధారణంగా దేశ భద్రత, రక్షణకు సంబంధించిన రహస్యాలను తెలుసుకునేందుకు ఈ హనీ ట్రాప్‌ను వాడతారని అనుకుంటాం. కానీ, ఇప్పుడు ప్రజా ప్రతినిధులకు హనీ ట్రాప్‌ తప్పడం లేదు. అది కూడా ఏదో ప్రభుత్వ రహస్యాలు చెప్పాలని కాదు. వ్యక్తిగతంగా వాళ్లను బ్లాక్‌ మెయిల్‌ చేయడానికి ఈ హనీ ట్రాప్‌ను కొందరు కేటుగాళ్లు అనుసరిస్తున్నారు.

ఇప్పుడు తెలంగాణలో కొందరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను టార్గెట్‌ చేస్తూ ఈ నయా హనీ ట్రాప్‌కు తెర లేపారు కంత్రీగాళ్లు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పర్సనల్‌ సెల్‌ నెంబర్లు తెలుసుకొని మరీ.. వీడియో కాల్‌ చేసి బెదిరిస్తున్నారన్న చర్చ జరుగుతోంది. ఇప్పటికే తెలంగాణలోని పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఈ ఫోన్‌ కాల్స్‌ వచ్చాయంటున్నారు. నేహ శర్మ పేరుతో వీడియో కాల్‌ చేసి ప్రజా ప్రతినిధులను ఉచ్చులో పడేసే ప్రయత్నం చేస్తున్నారట. అయితే, ఈ పరిణామంతో ప్రజా ప్రతినిధులు తలలు పట్టుకుంటున్నారు. కొందరు ఎమ్మెల్యేలు పోలీసులకు ఫిర్యాదు చేసినా.. మరికొందరు ఎమ్మెల్యేలు మాత్రం సైలెంట్‌గా ఉంటున్నారు.

ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండటంతో ఈ టాపిక్‌ మీద ఇప్పుడు లాబీల్లో చర్చ జరుగుతోంది. అసెంబ్లీ సమావేశాలకు వస్తున్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పరస్పరం ఈ హనీ ట్రాప్‌ వ్యవహారంపై తమ ఎక్స్‌పీరియన్స్‌ను షేర్‌ చేసుకుంటున్నారట. ఈ హనీ ట్రాప్‌ కాల్ వచ్చిందని ఒకరు చెబితే.. నాకూ వచ్చిందని ఎదుటి వాళ్లు బదులిస్తున్నారు. మీకే కాదు.. నాక్కూడా ఇలాంటి కాల్‌ వచ్చిందని మధ్యలో మరో నాయకుడు కలగ జేసుకుంటున్నాడట. ఇలా అసెంబ్లీ లాబీల్లో ఇంట్రస్టింగ్‌ డిస్కషన్స్‌ నడుస్తున్నాయని అంటున్నారు. ఈ మాదిరి హనీ ట్రాప్ కాల్స్ పార్టీలకతీతంగా ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు వస్తున్నాయని చెబుతున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు కాల్ చేసి వీడియో రికార్డు చేసి బీఆర్ఎస్ గ్రూపుల్లో వేస్తామని బెదిరిస్తున్నారట. అలాగే, బీఆర్ఎస్ పార్టీ నేతలకు కాల్ చేసిన వీడియోలు రికార్డు చేసి కాంగ్రెస్ గ్రూపుల్లో వేస్తామని బెదిరించడం హాట్ టాపిక్‌ అవుతోంది. తాము డిమాండ్‌ చేస్తున్నట్లు డబ్బులు అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్‌ చేస్తే ఏ బెడదా ఉండదని, లేదంటే ఎక్స్‌ పార్టీ సోషల్ మీడియాల్లో మీరు పావులుగా మారతారని బ్లాక్‌ మెయిల్ చేస్తున్నారట.

ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను టార్గెట్ చేస్తూ తరచూ కాల్స్ వస్తుండటంతో ఇప్పటికే చాలామంది నేతలు జాగ్రత్త పడుతున్నారట. నేటి సోషల్‌ మీడియా యుగంలో ప్రజా ప్రతినిధిగా నియోజకవర్గానికి చెందిన వాళ్లు ఎవరైనా ఆపదలో ఉండో, అవసరం ఉండో కాల్‌ చేస్తున్నారనుకొని ఆన్సర్‌ చేస్తే.. ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఎమ్మెల్యేలు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ హనీ ట్రాప్ వ్యవహారంతో ఎమ్మెల్యేల్లో కొత్త టెన్షన్ మొదలైందని చెబుతున్నారు. చేయని తప్పునకు బలి కావాల్సి వస్తుందేమోనని భయపడిపోతున్నారట. పోనీ.. తమ తప్పేం లేదని చెప్పినా ఇలాంటి వ్యవహారాల్లో ఎదుటి వాళ్లు నమ్మే పరిస్థితి ఉండదని ఎవరికి వాళ్లు లోలోపలే వణికిపోతున్నారట. ఇలాంటి వీడియో కాల్స్‌ రికార్డ్‌ చేసి సర్క్యులేట్‌ చేస్తే ప్రజల్లో చులకన అవుతామని ప్రజా ప్రతినిధులు ఆందోళన చెందుతున్నారు. ప్రజా ప్రతినిధులే టార్గెట్‌గా సాగుతోన్న ఈ కొత్త రకం హనీ ట్రాప్‌ వ్యవహారంపై ప్రభుత్వం పూర్తిస్తాయి విచారణ చేపట్టాలని విజ్ఞప్తులు వస్తున్నాయి.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com