30.2 C
Hyderabad
Tuesday, August 4, 2026

Live Video

spot_img

మూడు రోజుల్లోనే పీఎఫ్ సమస్యల పరిష్కారం

దేశంలోని కార్మికుల క్లైయిమ్​ లను కేవలం మూడు రోజుల్లోనే పరిష్కారం చూపే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టమైన ఆదేశాలిచ్చారని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్​ రెడ్డి అన్నారు. కేంద్రమంత్రి మన్సుఖ్​ మాండవీయా తో కలిసి ఈపీఎఫ్​ వో నూతన జోనల్​ కార్యాలయాన్ని బేగంపేటలో ప్రారంభించారు. కార్యక్రమంలో కేంద్రమంత్రి జి. కిషన్​ రెడ్డి మాట్లాడుతూ.. ప్రధాని మోదీ, మంత్రి మాండవీయాకు ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కార్మికుల సంక్షేమం కోసం అనేక నూతన విధానాలతో ముందుకు వెళుతుందన్నారు. దేశంలోనే సనత్​ నగర్​ ఈఎస్​ ఐ కార్మిక ఆసుపత్రి నెం.1గా నిలిచిందని ఇందుకు మంత్రి మన్సుఖ్​ మాండవీయాకు ధన్యవాదాలు తెలిపారు.

కార్మికులకు అస్యూర్డ్​ బెనిఫిట్స్​ రూ. 50 వేలు నిర్ణయించడం హర్షణీయమన్నారు. తెలంగాణ ప్రాంతంలో మరిన్ని ఆసుపత్రులు, ఈపీఎఫ్​ వోలు నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకోసం ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామన్నారు. రామగుండం లాంటి చోట్ల స్థలాలు కేటాయిస్తే పనులను మొదలు పెడతామన్నారు. హైదరాబాద్​ మహానగరంలో ఈ–కామర్స్​ (అసంఘటిత రంగం)లో పనిచేసే లక్షలాది కార్మికులకు కూడా ఈపీఎఫ్​ వో ఫలాలను అందించాలని ప్రధాని నరేంద్ర మోదీకి వివరిస్తానని, అందుకు కేంద్రమంత్రి మాండవీయాకు కూడా ఈ వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు. ఈ కామర్స్​ రంగం ప్రస్తుతం దేశంలో దినదినం ప్రవర్థమానంగా ఎదుగుతుందన్నారు. ఆ రంగంలో ఉన్న కార్మికుల క్షేమాన్ని కూడా కోరుతున్నట్లు చెప్పారు. ఈపీఎఫ్​ వో నూతన కార్యాలయాన్ని ప్రారంభిస్తూ సేవలను మరింత విస్తృతం చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ మరోసారి ప్రధాని మోదీ, మంత్రి మాండవీయాలకు కేంద్రమంత్రి జి.కిషన్​ రెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com