24 C
Hyderabad
Monday, July 27, 2026

Live Video

spot_img

ఏపీలో కొత్త విద్యా విధానం – 9 రకాల స్కూల్స్‌గా వర్గీకరణ

ఏపీలో కూటమి ప్రభుత్వం విద్యా రంగ సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలు చేసిన జీఓ-117ను రద్దు చేసి, 9 రకాల స్కూల్స్ విధానాన్ని తీసుకువస్తున్నారు. ఇందుకోసం అధికారులు ప్రాథమిక జాబితాను సిద్ధం చేశారు. కొత్త విధానం 2025-26 విద్యా సంవత్సరం నుంచి అమలులోకి రానుంది.

ఏపీలో స్కూల్‌ ఎడ్యుకేషన్‌లో తీసుకొస్తున్న మార్పుల్లో భాగంగా.. కొత్తగా ఏర్పాటు చేయబోయే స్కూల్స్ వివరాలు ఇలా ఉన్నాయ్‌.

1. శాటిలైట్ ఫౌండేషన్ స్కూల్స్

  • అంగన్‌వాడీలను మార్పు చేసి ప్రీ-ప్రైమరీ 1, 2 (ఎల్‌కేజీ, యూకేజీ) తరగతులతో శాటిలైట్ ఫౌండేషన్ స్కూల్స్‌గా ఏర్పాటు.
  • మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ స్కూల్స్‌ నిర్వహిస్తారు.

2. ఫౌండేషన్ పాఠశాలలు

  • ప్రీ-ప్రైమరీ 1, 2 తో పాటు 1, 2 తరగతులు కలిపి ఫౌండేషన్ స్కూల్స్‌గా మార్పు

3. బేసిక్ ప్రైమరీ స్కూల్స్

  • పీపీ 1, 2తో పాటు.. 1 నుంచి 5 తరగతులు కలిగి ఉండే స్కూల్స్
  • విద్యార్థులు 45 మందిలోపు ఉంటే ఈ కేటగిరీలోకి వస్తాయి.

4. ఆదర్శ ప్రాథమిక పాఠశాలలు

  • పీపీ 1, 2తో పాటు.. 1 నుంచి 5 తరగతులు కలిగి ఉండి 45 మందికి పైగా విద్యార్థులు ఉంటే ఆదర్శ ప్రాథమిక పాఠశాలలుగా వ్యవహరిస్తారు.

5. ప్రాథమికోన్నత పాఠశాలలు

  • 6, 7, 8 తరగతులకు పాఠ్యాంశాలు బోధించే పాఠశాలలు.
  • విద్యార్థుల సంఖ్య ఆధారంగా కొన్ని ఉన్నత పాఠశాలలు, మరికొన్నింటిని ప్రాథమిక పాఠశాలలుగా విభజిస్తారు.

6.ఉన్నత పాఠశాలలు

  • 6 నుంచి 10 తరగతులు ఉండే హై స్కూల్స్

7. బేసిక్ ప్రాథమిక ఉన్నత పాఠశాలలు

  • 1 నుంచి 10 తరగతులు కలిగి ఉండే స్కూల్స్
  • 45 మందిలోపు పిల్లలుంటే బేసిక్ స్కూల్స్‌గా పరిగణిస్తారు

8. ఆదర్శ ప్రాథమిక ఉన్నత పాఠశాలలు

  • 1-10 తరగతులు కలిగి ఉండి, 45 మందికి పైగా విద్యార్థులు ఉన్న స్కూల్స్.
  • ప్రతి తరగతికి ఒక టీచర్‌ను కేటాయిస్తారు.

9.హైస్కూల్ ప్లస్

  • రాష్ట్రవ్యాప్తంగా 294 హైస్కూల్ ప్లస్‌లు కొనసాగించనున్నారు.
  • వీటిలో 1 నుంచి 12 తరగతులు లేదా 6 నుంచి 12 తరగతులు ఉంటాయి.

తొలుత మొత్తం వీటిని ఐదు రకాల స్కూల్స్‌గా మాత్రమే రూపొందించాలనుకున్నారు. కానీ, క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించిన తర్వాత గవర్నమెంట్‌ స్కూల్స్‌ను మొత్తం 9 రకాల స్కూల్స్‌గా వర్గీకరించారు.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com