నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ఫ్యాన్స్ ఎంతగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బాలకృష్ణ వారసుడు, నందమూరి అందగాడు మోక్షు డెబ్యూ కోసం రంగం సిద్దమైంది. కరోనా టైంలో బాలయ్య తన కొడుకు ఎంట్రీ గురించి చెప్పాడు. ఆదిత్య 999 స్క్రిప్ట్ రెడీ చేస్తున్నానని, ఆ చిత్రంలో తన కొడుకు నటిస్తాడని, తాను కూడా అందులో నటిస్తానని అన్నాడు. కానీ ఆ ప్రాజెక్ట్ ఎందుకో పట్టాలెక్కలేదు. ఇక మోక్షు ఎంట్రీ కోసం సరైన దర్శకుడిని బాలయ్య వెతికాడు.
రీసెంట్ బ్లాక్‌బస్టర్ హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించే క్రేజీ ప్రాజెక్ట్‌తో గ్రాండ్‌గా అరంగేట్రం చేయబోతున్నారు. మోక్షజ్ఞ తొలి చిత్రం ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (PVCU)లో భాగం అవుతుంది.
మోడరన్, స్టైలిష్ లుక్‌లో అద్దంలోకి చూస్తున్న మోక్షజ్ఞ కొత్త స్టిల్ విడుదలైంది. ఈ స్టిల్ అతని నేచురల్ చరిస్మా, కాన్ఫిడెన్స్ ని ప్రజెంట్ చేస్తోంది. ఎమ్ తేజస్విని నందమూరి ప్రెజెంటర్ గా, లెజెండ్ ప్రొడక్షన్స్‌తో కలిసి ఎస్‌ఎల్‌వి సినిమాస్‌పై సుధాకర్ చెరుకూరి భారీ బడ్జెట్ ప్రాజెక్ట్‌ను నిర్మించనున్నారు. మోక్షజ్ఞ పుట్టినరోజున అనౌన్స్ చేసిన ఈ చిత్రం ఇప్పటికే సంచలనం సృష్టించింది. పౌరాణిక ఇతిహాసం నుంచి ప్రేరణ పొందిన ఈ చిత్రం ప్రీ-ప్రొడక్షన్ చివరి దశలో ఉంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కి సంబంధించిన ఇతర వివరాలను మేకర్స్ త్వరలో అనౌన్స్ చేస్తారు.