పెంపుడు జంతువులపై విపరీతమైన మమకారాన్న పెంచుకుంటూ ఉంటారు వాటిని పెంచుకునే వారు. ముఖ్యంగా శునకాలు, పిల్లులు వంటి జంతువులనైతే అయితే దాదాపు కుటుంబ సభ్యుల్లా చూసుకోవడం మనం అనేక మంది ఇళ్ళల్లో చూస్తుంటాం. ఈ మధ్య కాలంలో పెంపుడు జంతువులకు బర్త్ డే సెలబ్రేషన్లు చెయ్యడం, అవి మృతిచెందితే మనుషులకు చేసినట్లు అంతిమ సంస్కారాలు నిర్వహించడం చాలా చోట్ల కనిపిస్తూ ఉంటుంది. తాజాగా కరీంనగర్ జిల్లా మెట్ పల్లి పట్టణంలో ఒక కుటుంబం కుక్క పిల్లలకు ఘనంగా బారసాల నిర్వహించారు. మెట్ పట్టి పట్టణంలోని సుభాష్ నగర్ లో నివాసం ఉంటున్న రాపెల్లి వినోద్, లావణ్య దంపతులు ముద్దుగా పెంచకుంటున్న షీషు జాతి శునకం నాలుగు కుక్క పిల్లలకు జన్మనిచ్చింది. దీంతో తమ బంధుమిత్రులందరనీ పిలుచుకుని ఆ నాలుగు కుక్క పిల్లలకు బారసాలను వేకగా నిర్వహించారు. ఆ సందర్భంగా చేసిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది.