27 C
Hyderabad
Monday, June 29, 2026

Live Video

spot_img

తమిళనాడు బీజేపీకి కొత్త అధ్యక్షుడు

తమిళనాడు బీజేపీ శాసనసభా పక్ష నాయకుడు నైనార్ నాగేంద్రన్ శుక్రవారం చెన్నైలోని పార్టీ ప్రధాన కార్యాలయం కమలాలయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి అధికారికంగా నామినేషన్ దాఖలు చేశారు. ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షుడు కె. అన్నామలై, కేంద్ర సహాయ మంత్రి ఎల్. మురుగన్, పొన్ రాధాకృష్ణన్, వానతి శ్రీనివాసన్ సహా ఇతర బీజేపీ నాయకుల సమక్షంలో ఈ నామినేషన్ దాఖలు జరిగింది.

నాగేంద్రన్ మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. రెండుసార్లు అన్నాడిఎంకె నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన నాగేంద్రన్ 2021 శాసనసభ ఎన్నికల ముందు బిజెపిలో చేరి కమలం గుర్తుపై పోటీ చేసి గెలిచారు. ప్రస్తుత రాష్ట్ర అధ్యకుడు కె అన్నామలై పదవీ కాలం ముగియటంతో కొత్త అధ్యకుడుగా నయనార్ నాగేంద్రన్ ఎన్నిక కాబోతున్నారు.

తిరునల్వేలి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నాగేంద్రన్ రాష్ట్ర అధ్యక్ష పదవి చేపట్టడంతో శాసనసభ పక్ష నేతగా మరో ఎమ్మెల్యే సరస్వతికి ఎన్నుకునే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com