26.5 C
Hyderabad
Friday, November 6, 2026

Live Video

spot_img

కుంభమేళాలో నాగ సాధువులు ఇచ్చి పడేశారు..

  • హేతువాదులకు దేహ శుద్ధి..
  • ఆచార్య ప్రశాంత్‌ బుక్‌ స్టాల్‌ ధ్వంసం
  • అంధవిశ్వాసమన్న వారిపై దాడి
  • మరో ఘటనలో యూ ట్యూబర్‌ పై దాడి
  • ధ్యానం చేసుకుంటున్న సాధువు ముందు మైక్
  • ప్రశ్నలతో వేధిస్తుంటే తిరగబడ్డ సాధువు

ప్రయాగ్‌రాజ్‌ మహాకుంభ మేళా ఫుల్‌ జోష్‌ లో కొనసాగుతోంది. రోజురోజుకూ భక్తుల రద్దీ పెరుగుతోంది. సోషల్‌ మీడియా వేదికల ద్వారా కూడా ఈసారి కుంభమేళాకు విస్తృత ప్రచారం కనిపిస్తోంది. ఈ నేపధ్యంలో కుంభమేళా ఒక అంధవిశ్వాసమంటూ బయల్దేరిన కొందరు  యాక్టివిస్టులను నాగసాధువులు చితకబాదారు. ఆలస్యంగా వెలుగు లోకి వచ్చిన ఈ ఘటన మకర సంక్రాంతి రోజునే జరిగిందని తెలుస్తోంది. కుంభమేళా ఒక అంధ విశ్వాసమని, ఈ మూఢ నమ్మకాలను పారదోలాలని, చైతన్యవంతులు కావాలంటూ కొందరు కార్యకర్తలు కుంభమేళా పోస్టర్లను చించి తగల బెట్టారు. ఈ మూఢత్వం వదుల్చుకోవాలని, స్నానం చేస్తే పాపాలు ఎలా పోతాయని ప్రజలు ఆలోచనతో మసలు కోవాలని, ఇలాంటి మూఢ భక్తినుంచి బయట పడాలని పోస్టర్లుగా వేసి కొందరు ప్రచారం మొదలు పెట్టారు. సోషల్‌ మీడియా లో కూడా ఇది వేగంగానే వ్యాపించింది. అప్పటికే ఆ నోటా ఆనోటా దీని గురించి విన్న నాగ సాధువులు ఆగ్రహోదగ్దులయ్యారు. వెతికి పట్టుకుని మరీ ఆ ఆమూకలను చితక్కొట్టాలని నిర్ణయించారు. ఆచార్య ప్రశాంత్ స్టాల్‌ దగ్గర హేతువాద సంఘాలు బుక్ స్టాల్ పెట్టి మరీ కుంభమేళాపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని తెలుసుకుని నాగ సాధువులు అక్కడకు వెళ్లారు. వచ్చీ రావడంతోనే ఆ స్టాలును ధ్వంసం చేశారు. పుస్తకాలను చెల్లా చెదరుపడేశారు. స్టాల్‌ నిర్వాహకులపై దాడి చేశారు. మైకు పెట్టి ఏదో అడుగుతున్న జర్నలిస్టులకూ పనిలో పనిగా వాయించిపడేశారు. హిందూ ధర్మంపైనా, సంస్కృతిపైనా దాడి చేస్తారా అంటూ మండిపడ్డారు. కుంభమేళా అంధ విశ్వాసం ఎలా అవుతుంది? ఏం తెలుసని ఇష్టాను సారం అవాకులు, చవాకులు పేలుతున్నారు. మా ప్రాంగణంలోకి వచ్చి మా మీదే చెడు ప్రచారం చేస్తారా? మీ వ్యాపారాలు చేసుకోడానికి మా కుంభమేళా కావల్సి వచ్చిందా అంటూ వీరంగం వేశారు. అడ్డొచ్చిన వారికి దేహ శుద్ధి కూడా చేశారు. కోట్లాది మంది హిందువుల భక్తి, విశ్వాసాలపై దెబ్బ వేయాలని ప్రయత్నిస్తే ఖబడ్దార్ అంటూ రచ్చ రచ్చ చేశారు. ఈ ఉదంతం సంక్రాంతి రోజు జరిగిందని అంటున్నారు. వివరాలు వెల్లడి కాలేదు కానీ  ఓ వీడియో ద్వారా ఈ సంఘటన బట్టబయలైంది.

కోట్లాది మంది హిందువుల మధ్యలోకొచ్చి ఇలా దుష్ర్పచారం చేయడానికి ఎంత ధైర్యం? అని మండి పడిన నాగ సాధువులు. హేతువాద సంఘాల పుస్తకాలను తగులబెడతామని ఈ సంఘటనపై సీఎం యోగీ ఆదిత్యనాథ్‌ కు ఫిర్యాదు చేస్తామని అన్నారు.

మరోవైపు నాగసాధువుల తిరుగుబాటు, హేతువాదుల దేహశుద్ధిపై సోషల్‌ మీడియాలోప్రశంసల జల్లు కనిపిస్తోంది. హిందూ ధర్మంపై దాడి చేసేవారికి తగిన శాస్తి చేశారంటూ నెటిజన్లు చప్పట్లు చరుస్తున్నారు.

నాగసాధువు దెబ్బకు యూ ట్యూబర్‌ దౌడ్‌..

ఇలాంటిదే మరో ఘటన. కుంభమేళాలో నాగ సాధువులకు కేటాయించిన ప్రత్యేక గుడారాల్లో ఉంటూ నిశ్శబ్దంగా వారి పని వారు చేసుకుంటున్నారు. అలాంటి వారిని ఇంటర్వ్యూ చేసి ఏదో గొప్పకంటెంట్ ఇద్దామనుకున్న ఓ యూ ట్యూబర్‌ అత్యుత్సాహం అతన్ని చిక్కుల్లో పడేసింది. ఓ యూ ట్యూబర్‌ ప్రశాంతంగా ధ్యానం చేసుకుంటున్ననఖన్ అనే నాగ సాధువు ముందు మైకు పెట్టాడు. పెట్టీ పెట్టగానే ఎప్పటినుంచి సన్యాసం స్వీకరించారు స్వామీజీ అని ప్రశ్న వేశాడు. సాధువు ఓపికగానే నా చిన్నతనం నుంచి అని జవాబు చెప్పాడు. అక్కడితో ఆగకుండా మరో రెండు మూడు పనికి మాలిన ప్రశ్నలకు వేశాడు. వాటికీ ఆయన ఓపికగానే సమాధానమిచ్చాడు. ఆ తర్వాత  మీరు ఏ దేవుడి భజనలు పాడతారు అని మరో ప్రశ్నవేశాడు.ఈ సారి సాధువులో సహనం నశించింది. వెంటనే యూట్యూబర్‌ పీక పుచ్చుకున్నాడు. ఆ దెబ్బకు యూ ట్యూబర్‌ మైకు, కెమెరా, ఫోన్ ఇతర సరంజామా అక్కడే వదిలేసి పరుగో పరుగు. ఈ సంఘటన కూడా సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది. దీనికింద నెటిజన్లు ఆసక్తికరమైన కామెంట్లు కూడా పెట్టారు. వాళ్ల మానాన వాళ్లు ధ్యానం చేసుకుంటుంటే కోరి కెలకడం ఎందుకు? తన్నులు తినడం ఎందుకు అని కొందరు కామెంట్‌ చేస్తే.. క్రియేటివిటీ వికటించింది.. తన్నులు తిన్నాడు అంటూ కొందరు,ప్రతీవారు మైకు పట్టుకుని జనంలోకెళ్లి అడ్డగోలు ప్రశ్నలు వేస్తే ఇలాగే ఉంటుంది..సాధువు బాగా చేశారు అంటూ కొందరు కామెంట్లు పెట్టారు. ఇటువంటి సంఘటనలే అనేకం ప్రతిరోజూ కుంభమేళాలో దర్శనం ఇస్తున్నాయి. యూట్యూబ్‌ ఛానళ్ళకు కంటెంట్‌ కోసం స్వామీజీలను తెగ విసిగిస్తున్న యూట్యూబర్ల లెంపలు ఛెళ్ళుమనిపిస్తున్నారు సాధుపుంగవులు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com