దక్షిణాదిలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న కీర్తి సురేష్ ఇప్పుడు సరికొత్త పాత్రలో రాబోతోంది. నాగ చైతన్య జోడీగా కీర్తి సురేష్ అభిమానులకు కనువిందు చేయనుంది. నాగ్ తో లేటెస్ట్ మూవీ స్టిల్స్ ను సోషల్ మీడియా వేదికగా కీర్తి సురేష్ పంచుకుంది.
తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో వరసగా సినిమాలు చేసుకుంటూ బిజీ బిజీగా ఉంటోంది. ఈ భామ ఇప్పుడు అక్కినేని నాగ చైతన్యతో కలిసి దర్శకుడు చందు మొండేటి కాంబినేషన్‌లో చేస్తున్న సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది.
గోవాలో జరుగుతున్న ఈ సినిమా షూటింగ్ ఫోటోలకు తమిళ పొన్ను.. పెళ్లి కూతురు అని కీర్తి ట్యాగ్ చేసింది. ప్రేమ కథా చిత్రాల్లో సిన్సియర్ లవర్ గా ఉండే నాగ్ తో కీర్తి సురేష్ అల్లరి ఆకట్టుకోనుంది.
ఈ సినిమాలో నాగ చైతన్య మత్స్యకారుడిగా సరికొత్త పాత్ర పోషిస్తుండగా కీర్తి సురేష్ ఆయన ప్రియసఖిగా కనిపించనుంది. గుజరాత్ లోని సూరత్ బ్యాక్ డ్రాప్ లో స్టోరీని తెరకెక్కిస్తున్నారు.
ఇప్పటి వరకు అల్లరి పిల్లగానే అలరించిన కీర్తి సురేష్…నాగ్ తో ప్రేమాయణంలో సీరియస్ రోల్ చేస్తోందట.
నాగ చైతన్య , చెందు మొండేటి కాంబినేషన్లో గాథలో ప్రేమమ్, సవ్యసాచి సినిమాలు వచ్చాయి. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి ఈ కాంబినేషన్ రిపీట్ కానుంది.
గతంలో కీర్తిసురేష్ తో కలిసి మహానటి సినిమాలో అథితి పాత్ర చేసిన చైతన్య… అక్కినేని నాగేశ్వరరావు పాత్రలో కనిపించి ఆకట్టుకున్నాడు. ఇప్పుడు ఇద్దరు జతకట్టారు.
మొదట్లో ఈ సినిమాలో హీరోయిన్‌గా సాయి పల్లవి అనుకున్నా నాగ్ తో ఇప్పటికే చేసిందని…ఆమె వరుస సినిమాలతో బిజీగా ఉండటంతో డేట్స్ అడ్జెస్ట్ కాకపోవడం… కీర్తి సురేష్ తో అయితే విభిన్నంగా ఉంటుందని మార్చారట.
సమంతతో విడిపోయాక చైతన్య సూపర్ హిట్ రాలేదు. కీర్తి సురేష్ తో చేస్తున్న ఈ సినిమా నాగ చైతన్యకు మంచి హిట్ కొడుతుందని సినీ వర్గాల టాక్.
మహానటి పెళ్లి తర్వాత మరింత గ్లామరస్ గా కనిపిస్తోందని…. పెళ్లి ముందు కన్నా పెళ్లి తర్వాత కీర్తి సురేష్ పైట కొంగు జారిపోతోందని అభిమానులు ఆటపట్టిస్తున్నారు.
GA2 పిక్చర్స్ లో హీరోయిన్ గా కీర్తి సురేష్ ఓకే కావడంతో దర్శకుడు ఆమె పాత్రకు కొంత అల్లరి జోడించాడట. అప్పటి వరకు సీరియస్ అనుకున్న కథనం కొంత మార్చారని వినికిడి
సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లో సినిమాల ప్రమోషన్ అంటే కీర్తి సురేష్ అందరికన్నా ఫాస్ట్. నిర్మాతలు భారీ ఖర్చుతో తమ సినిమా ప్రమోషన్లు చేసుకుంటే…కీర్తి సురేష్ సోషల్ మీడియాలో అదే స్థాయిలో అప్ డేట్స్ ఇస్తోంది.