25.8 C
Hyderabad
Wednesday, June 24, 2026

Live Video

spot_img

భూకంప విలయానికి కకావికలమైన మయన్మార్, బ్యాంకాక్

  • రిక్టర్ స్కేలుపై తీవ్రత 7.7గా నమోదు
  • పదివేలు దాటిపోయిన మరణాలు, మరింత మంది?
  • ప్రాణాలరచేత పట్టుకుని ప్రజల పరుగులు
  • ఎక్కడికక్కడ కుప్పకూలిన ఆకాశ హర్మ్యాలు, భవనాలు
  • అంతకంతకూ పెరుగుతున్న మృతుల సంఖ్య
  • భయంతో అల్లాడిపోతున్న జనం.. సాయం కోసం అర్ధింపు
  • తూర్పు భారత దేశం, చైనాల్లో ప్రకంపనలు
  • భయం వద్దంటూ అభయమిచ్చిన మోడీ
  • సహాయానికి రంగంలోకి భారత వైమానిక దళాలు
  • 15 వేల టన్నుల విలువైనసామాగ్రి తరలింపు
  • ఆదుకుంటామన్న ఈయూ, అమెరికా దేశాలు

మయన్మార్, బ్యాంకాక్‌, థాయల్‌లాండ్ లలో నిన్న వేలాదిమందిని బలి గొన్న భూ కంపం తీవ్రతకు ఇటు తూర్పు భారత దేశంలో కొన్ని, చైనాలో కొన్ని భాగాలు కంపించాయి. భూకంప తీవ్రత మయన్మార్ లో మెజారిటీ భాగం, థాయ్ లాండ్‌ లలో వేలాది భవనాలను నేలమట్టం చేసేయగా,దీని తీవ్రతకు వేలాది మంది మృత్యువాత పడ్డారు మృతుల సంఖ్య పదివేల వరకూ ఉంటుందని అంచనా వేస్తున్నారు.

రిక్టర్ స్కేలుపై 7.7 గా నమోదు

వాయవ్య మయన్మార్ ఈ భూ కంపం ధాటికి కకావికలమైపోయింది. భారత కాలమానం ప్రకారం నిన్న సాయంత్రం 6.50 నిమిషాలకు మయన్మార్ వాయవ్య భాగంలో ఉన్న సగైంగ్‌ లో భూకంప కేంద్రం ఏర్పడినట్లు అధికారులు గుర్తించారు. భూమికి పది కిలోమీటర్ల లోతులో ఏర్పడిన ఈ భూ కంపం వల్ల రిక్టర్ స్కేలుపై 7.7 స్థాయిలో ప్రకంపనలు వచ్చినట్లు నమోదైంది. దీని తర్వాత కొన్ని నిమిషాల వ్యవధిలోనే చిన్న చిన్న ప్రకంపనలు అంటే6.6,కొన్ని చోట్ల 5.5 స్థాయిలో రికార్డయినట్లు భౌగోళిక శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ భూకంప మృతుల సంఖ్య వెయ్యి దాటిపోయినట్లు, మరిన్ని మరణాలు వెలుగు చూసే అవకాశం కనిపిస్తోందనీ తెలుస్తోంది.

అంతర్యుద్ధంతో సహాయానికి విఘాతం..

మయన్మార్ ప్రస్తుతం అంతర్యుద్ధంతో నలిగిపోతోంది.ప్రభుత్వాన్ని మిలటరీ స్వాధీనం చేసుకోవడంతో ఎమర్జెన్సీ సర్వీసులు నిలిచిపోయాయి. ఈ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు తగిన సిబ్బంది, ఇతర వాహనాలు, సేవలు లేకపోవడంతో బాధితులను ఆదుకోవడం కష్టంగా మారింది.
బ్యాంకాక్ లోని ఛటౌక్ మార్కెట్ సమీపంలో నిర్మాణంలో ఉన్న ఒక భవనం భూ కంపానికి కూలిపోవడంతో దాదాపు పది మంది స్పాట్ లోనే చనిపోయారు. మరో వంద మంది శిథిలాలకింద చిక్కుకుని ఉంటారని భయపడుతున్నారు.
మయన్మార్ మ్యాండలే ప్రాంతంలో భవనాలు కుప్పకూలి, దానిలోని స్టీల్‌ మెటల్ వంకర్లు తిరిగిపోవడంతో దాని కింద చిక్కుకు పోయిన వారిని వెలికి తీయడం సాధ్యపడటం లేదు. సగైంగ్‌ నదీతీరంలోని ఇర్రవాడి,-ఆవా మధ్యనున్న బ్రిడ్జి కుప్పకూలి నదిలో పడిపోయింది. అది దాదాపు వందేళ్ల నాటి బ్రిడ్జి.

సాయం చేయండి ప్లీజ్..

జుంతాల పాలనలో నలిగిపోతున్న మయన్మార్ భూ కంపం ధాటికి సర్వం కోల్పోవడంతో ప్రపంచ దేశాల సాయం కోరుతోంది. జుంతా చీఫ్ మిన్ ఆంగ్‌ హైంగ్‌ ఏ దేశమైనా, స్వచ్ఛంద సంస్థ అయినా తమకు సాయపడాలని అర్ధిస్తున్నారు.

ఆదుకుంటాం.. భయం వద్దు.. మోడీ

మయన్మార్ అపీల్‌ కు ముందుగా భారత్ స్పందించింది. భూ కంపం ధాటికి కకావికలమై పోయిన ఆ దేశానికి ఏ సాయం కావాలన్నా తాము అందిస్తామంటూ ప్రధాని మోడీ ప్రకటించారు. అందరి యోగ క్షేమాల గురించి ఇప్పటికే ప్రార్ధనలు చేస్తున్నట్లు, ఎలాంటి సహాయం కావాలన్నా తమను అడగాలనీ కోరారు. ఎమర్జెన్సీ సర్వీసులు, సేవలు సదా సిద్ధంగా ఉంటాయని ఎప్పుడు రమ్మన్నా వచ్చి ఆదుకుంటామని మోడీ భరోసా ఇచ్చారు. మయన్మార్, థాయిలాండ్ దేశాల విదేశాంగ శాఖలతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరపాలని, ఎలాంటి సాయం అందించడానికైనా మిలటరీ ఇతర సర్వీసులను సిద్ధంగా ఉండాలని మోడీ ఆదేశించారు.

రంగంలోకి ఎయిర్ ఫోర్స్

మనదేశంలోని ఎయిర్ ఫోర్స్ హిండన్ ఎయిర్ బేస్ నుంచి వైమానిక దళం బృందాలను థాయిలాండ్‌కు పంపించింది. అలాగే దుస్తులు, నీటి శుద్ధి సహాయ పరికరాలు, టెంటులు, బ్లాంకెట్లు, అత్యవసర మందులతో కూడిన 15 టన్నుల విలువైన సరుకును అక్కడకు తరలించింది.

మృతుల్లో భారతీయులు లేరు

థాయిలాండ్‌ ప్రధాని పెటాంగ్టన్ షినవ్రతా భూకంప నష్టాన్ని అంచనా వేయడానికి అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. భూకంపంలో భారతీయులెవరూ మరణించలేదని, అయినప్పటికీ అప్రమత్తంగా ఉండాలని మన విదేశాంగ శాఖ అక్కడి మన వారికి సూచించింది.

ఈయు, అమెరికా సాయం

యూరోపియన్ యూనియన్ దేశాలు, అమెరికా సైతం థాయిలాండ్‌, బ్యాంకాక్‌, మయన్మార్ లలో భూకంప బాధితులను ఆదుకునేందుకు ముందుకొచ్చాయి. మయన్మార్ ప్రభుత్వంతో వాషింగ్టన్ వర్గాలు టచ్ లో ఉన్నట్లు అవసరమైన సాయం అందించేందుకు ముందుకొస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com