36.2 C
Hyderabad
Friday, April 17, 2026

Live Video

spot_img

ముంబై.. మళ్లీ మెరిసేన్..

ముంబై మళ్లీ తానేంటో నిరూపించుకుంది. WPL ఫైనల్స్‌లో ఢిల్లీని మట్టి కరిపించి తన ఖాతాలో మరో కప్పును వేసుకుంది. కానీ ఈ ఫైనల్స్‌మ్యాచ్‌లో నరాలు తెగె ఉత్కంఠ మాత్రం కొనసాగింది. ఆఖరి బాల్ వరకు ఫ్యాన్స్‌ను టీవీకి అతుక్కుపోయేలా చేసింది.

నిజానికి మ్యాచ్‌కు ముందు టైటిల్ ఫేవరెట్ ఢిల్లీ అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే సీజన్ మొత్తం దూకుడైన ఆటతో ఫైనల్స్ వరకు వచ్చింది. భారీ స్కోర్లు బాదడంలో అయినా.. భారీ టార్గెట్‌లను చేజ్ చేయడమైనా.. తగ్గేదేలే అన్నట్టుగా ఉంది. కానీ ముంబై దూకుడు ముందు మాత్రం నిలవలేకపోయింది.

నిజానికి 8 ఓవర్లకే 2 వికెట్లు పడగొట్టి 28 పరుగులు మాత్రమే ఇచ్చింది ఢిల్లీ. కానీ ఆ తర్వాత ముంబై ఇచ్చిన కమ్‌ బ్యాక్ సూపరనే చెప్పాలి. హర్మన్ ప్రీత్ 66 పరుగులు చేసి టీమ్‌కు ఢిల్లీకి 150 పరుగుల టార్గెట్ ఇచ్చింది. ఇక టార్గెట్ చేజ్‌లో ఢిల్లీ పోరాడినా ఫలితం దక్కలేదు. కెప్టెన్‌ మెగ్‌ ల్యానింగ్‌, షెఫాలీవర్మ ఘోరంగా నిరాశపరిచారు. 17 పరుగులకు ఓపెనర్లు పెవిలియన్‌ చేరడంతో కష్టాల్లో పడింది క్యాపిటల్ టీమ్. ఓ దశలో రోడ్రిగ్స్‌, కాప్‌ ఇన్నింగ్స్‌ను గాడిలో పడేసే ప్రయత్నం చేసినా ఫలితం దక్కలేదు. ఇన్నింగ్స్‌ కుదురుకుంటున్న తరుణంలో రోడ్రిగ్స్‌ ఔట్‌ కావడంతో ఢిల్లీ అవకాశాలను దెబ్బతీసింది.

వరుసగా మూడుసార్లు ఫైనల్స్‌లో ఓడింది ఢిల్లీ ఉమెన్స్ టీమ్. ఓవైపు ముంబై ప్లేయర్స్ సంబరాలు జరుపుకుంటుంటే.. ఢిల్లీ టీమ్ మేట్స్ వర్ణనాతీతంగా ఉందనే చెప్పాలి.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com