ఐపీఎల్‌లో మరోవిజయాన్ని తన ఖాతాలో వేసుకుంది లక్నో సూపర్ జెయింట్స్. ముంబై ఇండియన్స్‌తో ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో లక్నో గెలుపు సాధించింది. ముందు బ్యాటింగ్ చేసిన లక్నో.. 8 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. అయితే ఈ టార్గెట్‌ను ఛేజ్ చేయలేకపోయారు ముంబై బ్యాటర్లు. 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 191 పరుగులు చేయగలిగింది. సూర్యకుమార్, నమన్ ధీర్ పోరాడినా.. ఫలితం లేకుండా పోయిందనే చెప్పాలి.
లక్నో బ్యాటర్లలో మిచెల్ మార్ష్, మార్‌క్రమ్ ముంబై బౌలర్లపై రెచ్చిపోయారనే చెప్పాలి. వీరిద్దరు హాఫ్ సెంచరీలు సాధించడం.. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ఇక డేవిడ్ మిల్లర్ 27, బదోని 27 పరుగులతో రాణించడంతో భారీ స్కోర్ చేయగలిగింది లక్నో.
ఈ మ్యాచ్‌లో హార్ధిక్ పాండ్యా సరికొత్త ఫీట్‌ను సాధించాడు. ఐపీఎల్‌లో ఐదు వికెట్లు తీసిన కెప్టెన్‌గా నిలిచాడు పాండ్యా. 4 ఓవర్లు వేసిన పాండ్యా.. 36 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తన అకౌంట్‌లో వేసుకున్నాడు. ఇక బౌల్ట్, అశ్వనీ కుమార్, విఘ్నేష్ తలా ఒక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.
204 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన ముంబైకు ఆదిలోనే షాక్ తగిలిందని చెప్పాలి. ఓపెనర్లు సరిగా రాణించలేదు. అయితే నమన్, సూర్యకుమార్ మాత్రం వేగంగా స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. అయితే ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన వారు వేగంగా పరుగులు చేయలేకపోవడంతో ముంబై ఓడిందని చెప్పాలి.
ఇక చివరి అయితే హైలేట్ అని చెప్పాలి. ఆఖరి ఓవర్ అవేష్‌ఖాన్ వేయగా.. ఈ ఓవర్‌లో 22 పరుగులు చేయాల్సి ఉంది. మొదటి బాల్‌ను పాండ్యా సిక్స్ బాదాడు. ఆ తర్వాత వేసిన ఐదు బాల్స్‌లో కేవలం 5 పరుగులు మాత్రమే ఇచ్చాడు. దీంతో లక్నో ఫ్యాన్స్ సంబరాలు మొదలయ్యాయి.