27.2 C
Hyderabad
Monday, November 2, 2026

Live Video

spot_img

అడివి శేష్ మృణాల్ ఠాకూర్… ‘డకాయిట్’

అడివి శేష్ మెగా పాన్-ఇండియా యాక్షన్ డ్రామా ‘డకాయిట్’ అడ్రినలిన్ పంపింగ్ ఎక్స్ పీరియన్స్ తో రూపొందుతోంది. షనైల్ డియో దర్శకత్వం వహిస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తున్నారు. సునీల్ నారంగ్ సహ నిర్మాత. ఈ చిత్రం హిందీ, తెలుగు భాషలలో ఏకకాలంలో షూట్ చేస్తున్నారు. అడివి శేష్ ,షానీల్ డియో సంయుక్తంగా కథ, స్క్రీన్ ప్లే రూపొందిచారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుగుతోంది. ఈ చిత్రం మహారాష్ట్రలో లాంగ్ షెడ్యూల్‌తో కొనసాగుతోంది.

మృణాల్ ఠాకూర్ ఈ చిత్రంలో ఫీమేల్ లీడ్ గా చేరారు. ఇద్దరు ఎక్స్ లవర్స్ మధ్య యాక్షన్, ఎమోషన్, డ్రామాతో నిండిన కథలోకి ఎంటరవ్వడానికి సిద్ధంగా ఉన్నారు.

యాక్టర్ పుట్టినరోజున సినిమా అనౌన్స్ మెంట్ చేసే ట్రెండ్‌కి బిన్నంగా, అడివి శేష్ తన ఫీమేల్ లీడ్ మృణాల్ ఠాకూర్‌ని అనౌన్స్ చేసి, అతని పుట్టినరోజును మరింత ప్రత్యేకం చేశారు. అడివి శేష్, మృణాల్ ఠాకూర్ పాత్రల మధ్య కెమిస్ట్రీని ప్రజెంట్ చేస్తూ డకోయిట్ టీం ఇంటెన్స్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. తనకు ద్రోహం చేసిన తన ఎక్స్ లవర్ పై ప్రతీకారం తీర్చుకునే కోపంతో ఉన్న దోషి కథగా డకోయిట్ వుండబోతుంది. ప్రేమ, ద్రోహం,ప్రతీకారం పవర్ ద్వారా నడిచే తీవ్రమైన యాక్షన్ డ్రామాకు వేదికగా ఆమెను ట్రాప్ చేయడానికి అతను ప్రమాదకరమైన ప్లాన్ ని రూపొందించాడు.

అడివి శేష్ ,మృణాల్ ఠాకూర్‌లతో కూడిన రెండు కొత్త పోస్టర్‌లు విడుదల చేశారు, వారి పాత్రల ఇంటెన్స్ డైనమిక్స్ ని ప్రజెంట్ చేస్తున్నాయి. ఒక పోస్టర్‌లో, శేష్ ఫెరోషియస్ గా కనిపించారు,మృణాల్ అతని వైపు విచారంగా చూస్తోంది. రెండవ పోస్టర్ భిన్నమైన ఇంటన్సిటీని చూపిస్తోంది. శేష్ కారులో స్టైలిష్‌గా కూర్చుని, సిగరెట్ వెలిగించగా, మృణాల్ కారు నడుపుతూ, చేతిలో తుపాకీతో కనిపించింది. రెండు పోస్టర్లు క్యారెక్టర్స్ కాంప్లెక్స్ సిటీని హైలైట్ చేస్తున్నాయి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com