25.8 C
Hyderabad
Thursday, June 25, 2026

Live Video

spot_img

పాకిస్తాన్‌ ప్రధానిపై ఎంపీల మండిపాటు

భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న వేళ, పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్‌కు తమ దేశంలోనే తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి. గురువారం పాకిస్థాన్ పార్లమెంటులో ఓ ఎంపీ ఆయనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. “షెహబాజ్ పిరికివాడు” అంటూ ఫైర్ అయ్యారు.

తాజాగా భారత్‌తో ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో గురువారం రాత్రి జమ్మూ, రాజస్థాన్, పంజాబ్‌ సరిహద్దుల్లో పాక్ డ్రోన్లు, మిసైళ్లతో దాడులకు యత్నించింది. అయితే, భారత సైన్యం అప్రమత్తంగా స్పందించి ఈ దాడులను విజయవంతంగా తిప్పికొట్టింది. పాక్ ప్రయోగించిన డ్రోన్లు, మిసైళ్లు, ఫైటర్ జెట్లను భద్రతా దళాలు కూల్చివేశాయి. అనంతరం భారత్, పాక్ లోని లాహోర్‌ సహా పలు ప్రాంతాల్లో కౌంటర్‌ ఎటాక్స్‌ చేసింది. ఈ పరిణామాలతో రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఇప్పటికే రక్షణశాఖ ‘ఆపరేషన్ సిందూర్’ కంటిన్యూ అవుతోందని వెల్లడించింది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ నేతలు తమ దేశ ప్రధాని షెహబాజ్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎంపీ వ్యాఖ్యలలో టిప్పు సుల్తాన్ చెప్పిన సూక్తిని కూడా కోట్‌ చేశారు. “పులి నాయకత్వం వహిస్తే పిరికివాళ్లు కూడా ధైర్యంగా పోరాడతారు, కానీ పిరికివాడు నాయకుడైతే పులులు కూడా పిరికివాళ్లలా మారిపోతారు” అని సాక్షాత్తూ పాకిస్తాన్‌ పార్లమెంటులో వ్యాఖ్యానించారు.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com