28.7 C
Hyderabad
Tuesday, June 2, 2026

Live Video

spot_img

త‌ల్లికి అస్వస్థత – స్పందించిన చిరంజీవి టీమ్

మెగాస్టార్ చిరంజీవి త‌ల్లి అంజనాదేవి అస్వస్థతకు గురయిన‌ట్లు ఉద‌యం నుంచి సోష‌ల్ మీడియాలో వార్త‌లు వైర‌ల్ అవుతున్నాయి. శుక్రవారం తెల్లవారుజామున అంజనాదేవి అస్వస్థతకు గురవడంతో కుటుంబ‌స‌భ్యులు నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారని ప్రచారం జరుగుతోంది. వైద్యులు ప్ర‌స్తుతం అంజ‌న‌మ్మ‌కి చికిత్స అందిస్తున్నట్లు వార్త‌లు వ‌చ్చాయి.

అయితే, ఈ వార్త‌ల‌పై మెగాస్టార్‌ చిరంజీవి టీమ్ తాజాగా క్లారిటీ ఇచ్చింది. అంజనాదేవి అస్వస్థతకు గురయిన‌ట్లు వస్తున్న వార్త‌ల్లో నిజం లేద‌ని తెలిపింది. రెగ్యుల‌ర్ చెక‌ప్‌లో భాగంగానే గ‌త వారం అంజ‌న‌మ్మ‌ను ఆస్పత్రికి తీసుకెళ్లినట్లు తెలిపింది. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం బాగానే ఉందని చిరంజీవి టీమ్ వెల్ల‌డించింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలు ఎవరూ నమ్మొద్దని విజ్ఞప్తి చేసింది.

వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి పుణ్యక్షేత్రంలో మహాశివరాత్రి జాతర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రంగుల లైటింగ్, డ్రోన్ వీడియోలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ మహాశివరాత్రికి సిద్ధమవుతుంది. వచ్చేనెల ఫిబ్రవరి 25 నుంచి 27 వరకు మూడు రోజులపాటు మహాశివరాత్రి జాతర నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com